Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (20:09 IST)
బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. టైటిల్ అందుకున్న రోజు రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలను ధ్వంసం చేసిన కేసులో ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం అతడిని స్వగ్రామం కొలుగూరులో అరెస్టు చేసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు తరలించినట్లు సమాచారం.
 
బిగ్ బాస్ ఫైనల్స్ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్న పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ అభిమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టైటిల్ గెలుచుకున్న ప్రశాంత్ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. 
 
అయితే అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ కూడా బయటకు రావడంతో ఇద్దరి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. అమర్‌దీప్‌ కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించారు. మరో పోటీదారుడు అశ్విని కారు అద్దాలు పగలగొట్టాడు. 
 
పలు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్‌ కారు అద్దంతో పాటు విధులు నిర్వహించేందుకు వచ్చిన బెటాలియన్‌ బస్సు అద్దాన్ని పగులగొట్టారు. పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్‌ను ఏ-2గా, అతని స్నేహితుడు వినయ్‌ను ఏ-3గా చేర్చారు. అయితే ఈ కేసులో ఏ-4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్లలో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయికిరణ్ (25), అంకిరావుపల్లి రాజు (23)లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments