బిగ్ బాస్ ఏడో సీజన్ ఫైనల్ దశకు చేరుకుంది. శనివారం గ్రాండ్ ఫినాలేలో అందరికంటే ముందే అర్జున్ ఎలిమినేట్ అయ్యారు. తర్వాత పొట్టి పిల్ల.. కానీ గట్టి పిల్ల అనిపించుకున్న ప్రియాంక జైన్ ఐదవ స్థానంలో ఎలిమినేట్ అయ్యింది.
గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఎలిమినేట్ అవుతూనే ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇచ్చాడు యావర్. మొత్తం నలుగురు కంటెస్టెంట్స్‌లలో రూ.15 లక్షల సూట్ కేసు ఆఫర్ చేశారని.. ఆ సూట్ కేసు తీసుకుని నాలుగో స్థానంలో హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఒకవేళ యావర్ ఆ రూ.15 లక్షలు తీసుకోకపోయినా ఎలిమినేట్ అయ్యేవాడు. టైటిల్ రేసులో అమర్ దీప్, శివాజీ, ప్రశాంత్ ముగ్గురి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. ఇక ఆ తర్వాతి స్థానంలో యావర్ ఉన్నాడు. ఒకవేళ రూ.15 లక్షల ఆఫర్ కాదనుకుంటే మాత్రం యావర్ ఖాళీ చేతులతో బయటకు వెళ్లేవాడు.