Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్ స్టోరీ ఓటీటీలో విడుదల అవుతుందా?

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (13:44 IST)
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా లవ్ స్టోరీతో ముందుకు వస్తున్నాడు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కరోనా కంటే ముందే మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇటీవలే ఈ సినిమాషూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. చకచకా ఈ షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. 
 
ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ సాంగ్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఎప్పుడెప్పుడు లవ్ స్టోరీ రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ నెలాఖరులో కానీ జనవరిలో కానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారంటూ ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. 
 
అయితే మొదట్లో ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదల అవుతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ తరవాత సినిమా థియేటర్స్‌కు కేంద్రం అనుమతి ఇవ్వడంతో థియేటర్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నారని టాక్ వచ్చింది. కానీ ఇంతవరకు దానిపైన క్లారిటీ లేదు. అటు చిత్రయూనిట్ కూడా రిలీజ్ పై స్పందించకపోవడంతో ప్రేక్షకుల్లో రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments