Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''మిస్ ఇండియా'' కోసం కీర్తి సురేష్.. టీ లవర్స్‌కు ఆ ఫోటో ట్రీట్

Advertiesment
''మిస్ ఇండియా'' కోసం కీర్తి సురేష్.. టీ లవర్స్‌కు ఆ ఫోటో ట్రీట్
, మంగళవారం, 3 నవంబరు 2020 (16:28 IST)
Keerthy Suresh
మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తాజాగా టైటిల్‌ రోల్ పోషించిన లేటెస్ట్‌ మూవీ 'మిస్‌ ఇండియా. టైటిల్ చూసి ఈ సినిమా అందానికి సంబంధించిందై ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సినిమా ట్రైలర్ చూసి షాక్ అయ్యారు. మన తెలుగు వారు ఎంత గానో ప్రేమించే ఛాయ్ గురించి సినిమాలో ఉండటం చూసి సంతోష పడ్డారు.
 
తాజాగా కీర్తి సురేష్ తన ఇన్ స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు చూసి ఛాయ్ ప్రియులు మరింత సంబరపడుతున్నారు. అందులో కీర్తి చేతిలో టీ కప్పు పెట్టుకుని క్యూట్‌గా నవ్వుతూ కనపడుతున్నారు. దీనికి ఆమె కాఫీ దొరికే చోటును షాప్ అంటాం.. ఛాయ్ దొరికే చోటుని కొట్టు అంటాం.. ఒకటి ఫీలింగ్ ఇంకోటి నా ఎమోషన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోను టీ లవర్స్‌కు ట్యాగ్ కూడా చేశారు కీర్తి. దీంతో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో కీర్తి పోస్టు చేసిన ఫొటో చక్కర్లు కొడుతోంది. 
 
నరేంద్రనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న మిస్ ఇండియా సినిమాను ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు నిర్మించారు. కీర్తి సురేష్‌ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో ఇదే భారీ బడ్జెట్‌ సినిమా. అంతేకాదు, కీర్తి సురేష్‌ను సరికొత్తగా ఆవిష్కరించిన చిత్రం ఇది. ఈ సినిమా నవంబర్‌ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.
 
విదేశాల్లో ఎక్కువగా కాఫీ తాగడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి ఓ దేశంలో మన దేశం నుండి వెళ్లిన ఓ అమ్మాయి టీ బిజినెస్‌ను స్టార్ట్‌ చేస్తుంది. బిజినెస్‌ రంగంలో రాణించాలని ఆ మధ్య తరగతి అమ్మాయి చాలా కలలు కంటుంది. టీ బిజినెస్‌ స్టార్ట్‌ చేసినప్పుడు ఆమెకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఆమె ఎలా అధిగమించి సక్సెస్‌ అయ్యిందనేదే 'మిస్‌ ఇండియా' సినిమా.
 
మిస్ ఇండియా తర్వాత కీర్తి మరిన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆమె నటించిన 'గుడ్‌లక్‌ సఖి' విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత 'సర్కారు వారి పాట', 'అణ్ణాత్తే' సినిమాల్లో ఆమె నటించనుంది . వీటితో పాటు ఓ తమిళ చిత్రం, రెండు తెలుగు చిత్రాలు డిస్కషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ సీక్రెట్ బయటపెట్టిన ప్రేమ పావురాలు హీరోయిన్