Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరు ఆదార్ లవ్ తమిళ సాంగ్ టీజర్.. ఎలా వుందంటే? (వీడియో)

ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటి సెలెబ్రిటీగా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మలయాళ కుట్టి నటించిన ఒరు ఆదార్ లవ్ తమిళ సాంగ్ టీజర్ ట్రెండింగ్‌లో వైరల్ అవుతోంది. ఇందులోనూ ప్రియా ప్రకాష్ వారియల్ హావ

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (12:38 IST)
ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటి సెలెబ్రిటీగా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మలయాళ కుట్టి నటించిన ఒరు ఆదార్ లవ్ తమిళ సాంగ్ టీజర్ ట్రెండింగ్‌లో వైరల్ అవుతోంది. ఇందులోనూ ప్రియా ప్రకాష్ వారియల్ హావభావాలు అదిరిపోయాయి. 
 
''మున్నాలే పోనాలే'' అంటూ సాగే ఈ పాట ప్రియా ప్రకాష్‌ను ఇష్టపడే ప్రతి హృదయాన్ని ఆకట్టుకునేలా వుంది. కెమిస్ట్రీ ల్యాబ్, స్కూల్ పార్క్‌లలో ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్ సీన్స్ అదిరిపోయాయి. కోలీవుడ్ స్టైల్‌లో యూత్‌ను తెగ ఆకట్టుకునే ఆ ట్రైలర్‌ను చూస్తే తప్పకుండా ప్రియా ప్రకాష్ తొలి సినిమాతో హిట్ కొట్టక తప్పదని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
ఇకపోతే.. ఒరు ఆదార్ లవ్ సినిమాకు ఒమర్ లులు దర్శకత్వం వహిస్తున్నారు. హైస్కూల్ రొమాన్స్‌తో ఈ సినిమా తెరకెక్కింది. లవర్స్ డేని పురస్కరించుకుని ప్రియా వారియర్ ఈ సినిమాలో భాగంగా కన్నుగీటిన సీన్ వైరల్ కావడంతో ఓవర్ నైట్‌లో సెలెబ్రిటీగా మారిపోయింది.
 
ప్రియా ప్రకాష్ హావభావాలకు నెటిజన్లే కాదు.. సినీ స్టార్స్ అల్లు అర్జున్, బాలీవుడ్ స్టార్స్ రిషీ కపూర్, సిద్దార్థ్ ఫిదా అయిన సంగతి తెలిసిందే. ఇంకేముంది.. ప్రియా ప్రకాష్ వారియర్ తమిళ సాంగ్ టీజర్ ఎలా వుందో ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments