Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చీరకట్టులో ప్రియా వారియర్.. ఫిదా అయిన నెటిజన్లు.. ఫోటో

సోషల్ మీడియాలో ప్రియా వారియర్ ఓవర్‌నైట్‌లో సెలెబ్రిటీగా మారిపోయిన సంగతి తెలిసిందే. కన్నుగీటి యూత్‌ను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ''ఒరు ఆదార్ లవ్'' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముం

Advertiesment
చీరకట్టులో ప్రియా వారియర్.. ఫిదా అయిన నెటిజన్లు.. ఫోటో
, సోమవారం, 16 ఏప్రియల్ 2018 (14:05 IST)
సోషల్ మీడియాలో ప్రియా వారియర్ ఓవర్‌నైట్‌లో సెలెబ్రిటీగా మారిపోయిన సంగతి తెలిసిందే. కన్నుగీటి యూత్‌ను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ''ఒరు ఆదార్ లవ్'' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఓ కనుసైగతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రియా వారియర్.. తాజాగా చీరకట్టులో ఫోటో దిగి పోస్టు చేసింది. ఈ ఫోటో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. 
 
ఇటీవలి కాలంలో తన అభిమానులకు దగ్గరగా ఉండేందుకు పలు అంశాలను షేర్ చేసుకుంటున్న ప్రియ, మలయాళ న్యూ ఇయర్ ''విషూ'' సందర్భంగా చీరకట్టులో మెరిసిపోయింది. మలయాళ కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని ఓ దీపాన్ని పట్టుకుని చీరకట్టులో కనిపించింది. సంప్రదాయం ఉట్టిపడేలా ప్రియా వారియర్ చీరకట్టు, నుదుట బొట్టుతో కనిపించింది. ఈ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిడిపిలోకి మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి... ఏ పదవిస్తారో తెలుసా..?