Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియా ప్రకాష్ వారియర్‌పై మరో కేసు.. కన్నుగీటడం.. ఇస్లాంకు వ్యతిరేకమంటూ?

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ''ఒరు అదార్ లవ్''లోని ఓ పాట నెట్టింట వైరల్ అయ్యింది. ఈ పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ హావభావాలు యూత్‌ను కట్టిపడేశాయి. ఈ వీడియోలో ప్రియా ప్రకాశ్ వారియర్ కన్నుగీటి నెట్టిం

Advertiesment
ప్రియా ప్రకాష్ వారియర్‌పై మరో కేసు.. కన్నుగీటడం.. ఇస్లాంకు వ్యతిరేకమంటూ?
, సోమవారం, 9 ఏప్రియల్ 2018 (16:13 IST)
ప్రేమికుల రోజును పురస్కరించుకుని ''ఒరు అదార్ లవ్''లోని ఓ పాట నెట్టింట వైరల్ అయ్యింది. ఈ పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ హావభావాలు యూత్‌ను కట్టిపడేశాయి. ఈ వీడియోలో ప్రియా ప్రకాశ్ వారియర్ కన్నుగీటి నెట్టింట సెలెబ్రిటీగా మారిపోయింది. అయితే ఈ పాట ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ హైదరాబాద్‌కు చెందిన ముస్లింలు గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 
 
అలాగే ఈ చిత్ర దర్శకుడు ఒమర్‌పై.. ప్రియా ప్రకాష్ వారియర్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ తొలి కేసు విషయమై ప్రియా ప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చూడాలని కోరిన ఆమెకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. గత మార్చి 1న విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్‌కు వాయిదా పడటం తెలిసిందే.
 
కాగా, తాజాగా హైదరాబాద్‌కే చెందిన కొందరు ముస్లింలు మళ్లీ సుప్రీంకోర్టులో మరో కేసు వేశారు. కన్నుగీటడం ఇస్లాం మత సంప్రదాయానికి వ్యతిరేకమన్నారు. ఈ చిత్ర విడుదలకు అనుమతిచ్చే ముందు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ నటి పేరు తలుచుకుంటేనే వణికిపోతున్న రకుల్... ఎందుకు?