Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మతం మారనన్న హిందూ యువతిపై ఘోరం: గ్యాంగ్ రేప్, హత్య.. చెట్ల పొదల్లో పడేసి?

జార్ఖండ్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఇస్లాం మతం స్వీకరిచేందుకు నిరాకరించిన పాపానికి ఓ హిందూ యువతిపై ఘోరం జరిగింది. మతం మార్చనని తెగేసి చెప్పిన హిందూ యువతిపై ఆమె మామ, బంధువు అత్యాచారం చ

Advertiesment
మతం మారనన్న హిందూ యువతిపై ఘోరం: గ్యాంగ్ రేప్, హత్య.. చెట్ల పొదల్లో పడేసి?
, శుక్రవారం, 29 డిశెంబరు 2017 (10:49 IST)
జార్ఖండ్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఇస్లాం మతం స్వీకరిచేందుకు నిరాకరించిన పాపానికి ఓ హిందూ యువతిపై ఘోరం జరిగింది. మతం మార్చనని తెగేసి చెప్పిన హిందూ యువతిపై ఆమె మామ, బంధువు అత్యాచారం చేసి.. హతమార్చారు. ఈ ఘటన నెల ముందే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ముస్లిం యువకుడు ఆదిల్‌ను గత నెలలో ఓ హిందూ యువతి పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులను కాదని ముస్లిం యువకుడిని వివాహం చేసుకుంది. 
 
పెళ్లికి తర్వాత జార్ఖండ్ బొకారోలోని తన మామయ్య ఇంటికి భార్యతో కలసి ఆదిల్ వెళ్లాడు. అనంతరం, ఆదిల్ తండ్రికి ఆయన సమాచారం అందించాడు. బొకారోకు ఆదిల్ తండ్రి చేరుకున్న తర్వాత... హిందూ మతస్తురాలైన సదరు యువతిని ఇస్లాం మతం స్వీకరించాలని ఒత్తిడి చేశారు. కానీ ఆమె మతం మారనని తెగేసి చెప్పేసింది. ఆ తర్వాత రాంచీలో ఆదిల్‌ కాపురం పెడతామని నమ్మబలికారు. రాంచీకి వెళ్లేందుకు గాను రైల్వే స్టేషన్‌కు వెళ్లాలని హిందూ యువతిని, ఆదిల్‌ను తీసుకెళ్లారు. ఆమె కూడా వారి వెంట వెళ్లింది. అయితే అటవీ ప్రాంతంలోకి దారిమళ్లించిన దుర్మార్గులు.. హిందూ యువతిపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశారు. చెట్ల పొదల్లోనే శవాన్ని పడేసి పారిపోయారు. 
 
నవంబర్ 6 నుంచి కనిపించకుండా పోయిన సదరు యువతి మృతదేహాన్ని గర్నా నది ఒడ్డున కనుగొన్నారు. పోస్ట్ మార్టంలో ఆమెపై అత్యాచారం జరిగిందనే విషయం వెల్లడైంది. ఈ ఘటనపై ఆదిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రేయసిపై అత్యాచారం జరుగుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించానని.. కానీ తనను చెట్టుకు కట్టేశారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఘటనపై హిందూ సంస్థలన్నీ భగ్గుమంటున్నాయి. ఇది ముమ్మాటికీ  లవ్ జీహాదే అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దినకరన్‌కు మద్దతు.. 46 మందిపై ఈపీఎస్ వేటు