Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో నో ఎలిమినేషన్.. చరిత్రలోనే తొలిసారి?

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (10:59 IST)
బిగ్ బాస్ ఆరో సీజన్ మొదటి వారాన్ని సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ప్రతివారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలిసిందే. ఈ సారి కూడా అలాగే నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. 
 
మొదటివారం చంటి, రేవంత్‌, శ్రీ సత్య, ఆరోహి, ఇనయా, అభినయశ్రీ, ఫైమా ఎలిమినేషన్‌కి నామినేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఆదివారం నాడు ఈ ఎలిమినేషన్‌లో ఉన్న వాళ్లలో ఒకర్ని బయటకి పంపించేస్తారు అనుకున్నారు అంతా. కానీ ఈ సారి బిగ్‌బాస్ ఎప్పుడూ లేని ట్విస్ట్ ఇచ్చాడు.
 
ఆదివారం ఎప్పటిలాగే ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టారు నాగార్జున. చివరికి ఇనయ సుల్తానా, అభినయశ్రీ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని కంటెస్టెంట్స్, ప్రేక్షకులు అంతా ఉత్కంఠంగా ఎదురుచూశారు. చివరగా వీరిద్దరిని నాగార్జున గార్డెన్‌ ఏరియాకి పిలిచి అక్కడున్న రెండు భారీ సుత్తులని ఎత్తమన్నారు. 
 
ఎవరు సుత్తిని ఎత్తలేకపోతే వారు ఎలిమినేట్ అవుతారు అని చెప్పాడు నాగ్. అయితే ఇద్దరూ సుత్తిలని ఎత్తారు. దీంతో మరోసారి అంతా షాక్ అయి ఎవర్ని ఎలిమినేట్ చేస్తారా అని ఎదురు చూశారు.
 
అయితే చివర్లో నాగార్జున అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ సారి మొదటివారం ఎలిమినేషన్‌ తీసేస్తున్నట్టు ప్రకటించారు. ఆరు సీజన్లలో మొట్టమొదటి సారి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నాగార్జున ఈ విషయం చెప్పగానే ఇనయా, అభినయశ్రీ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పండమేరు వంతెన నిర్మాణానకి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments