Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

04-09-2022 నుంచి 10-09-2022 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

Astrology
, శనివారం, 3 సెప్టెంబరు 2022 (19:40 IST)
Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఖర్చులు అధికం. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. మంగళ, బుధ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. పనుల్లో ఒత్తిడి అధికం. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల రెన్యువలో అలక్ష్యం తగదు. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. నిరుద్యోగులకు శుభయోగం. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి, మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. వృత్తుల వారికి ఆశాజనకం.
 
 
మిథునం :మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. గృహంలో మార్పుచేరులకు అనుకూలం. శుక్ర, శని వారాల్లో పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ముఖ్యుల సందర్శన కోసం పడిగాపులు తప్పవు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. న్యాయ, వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వివాదాలు కొలిక్కివస్తాయి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ఆదివారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
ఇచ్చిన నిలబెట్టుకుంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు అవసరాలకు ధనం అందుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సోమ, మంగళ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. సంతానం ఉన్నత చదువుల పై దృష్టి పెడతారు. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కార్మికులకు పనులు లభిస్తాయి. ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకుంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
వ్యవహారానుకూలత ఉంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మీ నమ్మకం వమ్ముకాదు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మెలగండి. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. బుధ, గురు వారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. నోటీసులు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. నిర్మాణాలు ఊపందుకుంటాయి.
 
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పురస్కారాలు అందుకుంటారు. ప్రముఖులతో సంబంధాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ఆది, శని వారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అధికారులకు అదనపు బాధ్యతలు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సోమ, గురు వారాల్లో అప్రియమైన వార్తలు వినవలసివస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
చాకచక్యంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు సామాన్యం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గురు, శుక్ర వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ధార్మిక విషయాలపై దృష్టి పెడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. కార్మికులకు కష్టసమయం. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఏది జరిగినా మంచికేనని భావించండి. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పరిచయాలు, వ్యాపకాలు విస్తృతమవుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
వ్యవహారాలతో తీరిక ఉండదు. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ఆది, సోమ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. గృహమార్పు కలిసివస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వైద్య, సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆకస్మికంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ఈ వారం వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. చిత్తశుద్ధిని చాటుకుంటారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. గుట్టుగా మెలగండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆవులకు సాయం అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు తప్పకపోవచ్చు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు హోదామార్పు, ఆకస్మిక స్థానచలనం. ప్రింటింగ్, కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-09-2022 శనివారం దినఫలాలు - శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం..