కొబ్బరి ప్రకృతి ప్రసాదం. కొబ్బరికాయలో నీటిని వుంచడం ప్రకృతి సృష్టి అనే చెప్పాలి. అలాంటి కొబ్బరికాయను తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇక ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన జరుపుకుంటారు. కొబ్బరికాయల విలువ, వాటి ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేయడమే ప్రపంచ కొబ్బరి దినోత్సవ లక్ష్యం.
ఆహారం, ఇంధనం, ఔషధం, సౌందర్య సాధనాలు, నిర్మాణ వస్తువుల్లో కొబ్బరిని ఉపయోగిస్తారు. కొబ్బరి బహుముఖ వినియోగం కారణంగా కొబ్బరి తాటిని తరచుగా 'జీవన వృక్షం' అని పిలుస్తారు. భారతదేశంలో, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మొదలైన రాష్ట్రాలలో కొబ్బరి అభివృద్ధి బోర్డు (CDB) మద్దతుతో ఈ రోజును జరుపుకుంటారు.
ప్రపంచ కొబ్బరి దినోత్సవం 2022: థీమ్
అంతర్జాతీయ కొబ్బరి సంఘం ప్రపంచ కొబ్బరి దినోత్సవ థీమ్‌లను ఎంచుకుంటుంది. ఈ సంవత్సరం ప్రపంచ కొబ్బరి దినోత్సవం థీమ్ “కొబ్బరిని ఒక మంచి భవిష్యత్తు..జీవితం కోసం పెంచడం”
ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ (APCC) 2వ సెప్టెంబర్ 1969న స్థాపించబడింది. 2009లో ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ, ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ (APCC) ద్వారా మొదటి ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని సెప్టెంబర్ 2, 2009న జరుపుకున్నట్లు ప్రకటించింది. అప్పటి నుండి, UN-ESCAP (యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమీషన్ ఫర్ ది ఆసియా పసిఫిక్) అధికారం ద్వారా ప్రతి సంవత్సరం APCC క్రింద ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది.
కొబ్బరి గురించి:
కొబ్బరి చెట్టు తాటి చెట్టు కుటుంబానికి చెందినది. కోకోస్ జాతికి చెందిన ఏకైక జీవ జాతి. కొబ్బరి మానవాళికి ఆహారం, నీరు, ఫైబర్, కలప వంటి ముడి పదార్థాలను అందిస్తుంది. అందుకే వరల్డ్ కోకోనట్ డే ద్వారా దాని వాణిజ్య ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నారు. పోషకాలతో కూడిన చౌకైన ఆహార వనరుల్లో కొబ్బరి ఒకటి. కాబట్టి కొబ్బరిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా వుండవచ్చుననే సత్యాన్ని ఈ రోజున గమనించవచ్చు.