Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గొంతులో ఆహారం ఇరుక్కుని బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె మృతి.. ఎక్కడ?

poonam mourya
, ఆదివారం, 28 ఆగస్టు 2022 (10:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కుమార్తె ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందారు. గొంతులో ఆహారం ఇరుక్కోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు చెబుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆస్రత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్దారించారు. ఈ విషాదం యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో జరిరగింది. 
 
ప్రతాప్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుమర్తె పూనమ్ మౌర్య (32) ఐదేళ్ల క్రితం భోపాల్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ సంజయ్‌ను పెళ్లి చేసుుకుంది. కొంతకాలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసిన సంజయ్‌ ఆ తర్వాత సొంతగా వ్యాపారం చేస్తూ, భోపాల్‌లోని అయోధ్య నగర్‌లో తన భార్య పిల్లలతో కలిసివుంటున్నాడు. 
 
ఈ క్రమంలో గురువారం పూనమ్ ఎంతకీ నిద్రలేవకపోగా అపస్మారకస్థితిలో పడివుండటాన్ని గుర్తించి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యుల పూనమ్ చనిపోయినట్టు వైద్యులు చెప్పారని సంజయ్ వెల్లడించారు. 
 
ఆ తర్వాత మృతదేహానికి నిర్వహించిన శవపంచనామాలో ఆమెకు గొంతులో ఆహారం ఇరుక్కుపోవడం వల్ల ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్టు అటాప్సీలో తేలింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. విదేశాల్లో సోనియా ఫ్యామిలీ..