Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

03-09-2022 శనివారం దినఫలాలు - శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం..

Advertiesment
tula rashi
, శనివారం, 3 సెప్టెంబరు 2022 (04:00 IST)
మేషం :- ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పెద్దమొత్తం ధన సహాయం తగదు. సంతానం అత్యుత్సాహం ఆందోళన కలిగిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. బంధుమిత్రులకు ముఖ్య సమాచారం అందిస్తారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం.
 
వృషభం :- సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆలోచనలు పథకాలు కార్యరూపందాల్చుతాయి. వాగ్వాదాలు, అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
మిథునం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు కొలిక్కి రాగలవు. వ్యాపారాల్లో పురోభివృద్ధి అనుభవం గడిస్తారు. బాకీలు, ఇతరత్రా రావలసిన ఆదాయానికి లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తుల యత్నాలకు కొంతమంది ఆటంకాలు కలిగిస్తారు.
 
కర్కాటకం :- ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా అనుకున్న విధంగా పూర్తి కాగలవు.
 
సింహం :- వృత్తి వ్యాపారాల్లో పోటీ ఆందోళన కలిగస్తుంది. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రముఖుల సిఫార్సుతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త అవసరం. కలిసివచ్చిన అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోండి. ఏ విషయంపై ఆసక్తి పెద్దగా ఉండదు.
 
కన్య :- వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా ఉండవు. పెద్దలు, ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి, అదనపు బాధ్యతలతో తీరిక ఉండదు. కొన్ని సమస్యల నుంచి క్షేమంగా బయటపడతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు మెరుగైన అవకాశం లభిస్తుంది.
 
తుల :- వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు తొలగి లాభాలు గడిస్తారు. తెలివిగా అడుగు వేస్తున్నామనుకుని తప్పటడుగు వేస్తారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు. రాజకీయనాయకులు కీలకమైన పదవులు, బాధ్యతలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి.
 
వృశ్చికం :- ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యుల నుండి ఆక్షేపణలు, అభ్యంతరాలెదుర్కుంటారు. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. సమయానికి ధనం అందక ఇబ్బందులెదుర్కుంటారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి.
 
ధనస్సు :- కుటుంబ, ఆర్థిక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. విమర్శలు, అభ్యంతరాలకు ధీటుగా స్పందిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. ఆరోగ్య విషయంలో అలక్ష్యం తగదు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఒక అవకాశం కలిసివస్తుంది. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి.
 
మకరం :- ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. ధనం ఖర్చు చేసే విషయంలో మితంగా వ్యవహరించడం మంచిది. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. కానవస్తుంది.
 
కుంభం :- వృత్తి వ్యాపారాలు, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, నూతన పెట్టుబడులకు అనుకూలిస్తాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
మీనం :- ఆర్థిక స్థితిలో మార్పు మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకుల అవసరాలు, కోరికలు నెరవేరగలవు. కొత్త యత్నాలు మొదడలెడతారు. దైవ, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థత చాటుకుంటారు. అర్థంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు అధికం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

02-09-2022 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి అర్చించిన శుభం