Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిపిలుపు : తన అభిమాన హీరోకు ప్రత్యేక ఆహ్వాన పత్రిక

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (17:56 IST)
సాధారణంగా హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ, ఒక హీరో మరో హీరోకు అభిమానిగా ఉండటం చాలా చాలా అరుదు. అలాంటి హీరోల్లో నితిన్ ఒకరు. ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. పవన్ అంటే.. ఓ సాధారణ అభిమానిలా అమితమైన పిచ్చి. అయితే, ఈ నెల 26వ తేదీన హీరో నితిన్ వివాహం జరుగనుంది. హైదరాబాద్ నగరంలోని ఓ లగ్జరీ హోటల్‌లో ఈ వివాహ మహోత్సవ కార్యక్రమం జరుగనుంది. 
 
ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ ఈ వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాల‌వారు, స‌న్నిహిత మిత్రులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. అలాగే తన అభిమాన నటుడు పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ను కూడా నితిన్ తన పెళ్లికి ప్రత్యేకంగా ఆహ్వానించాడట. పవన్‌తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మెగా హీరో వరుణ్ తేజ్‌లకు కూడా ఇన్విటేషన్ అందిందట. 
 
కాగా, రెండు రోజుల క్రితం తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కూడా నితిన్ ఆహ్వాన పత్రిక ఇచ్చారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను హీరో నితిన్ కలిసి తన వివాహానికి వచ్చి ఆశీర్వదించాల్సిందిగా ప్రత్యేకంగా కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments