Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

దేవీ
మంగళవారం, 10 జూన్ 2025 (12:48 IST)
tammudu- Nitin
పవన్ కళ్యాణ్ సినిమా హరిహరవీరమల్లు సినిమా వాయిదా పడడంతో పలు సినిమాలు ముందుకు వస్తున్నాయి. ముందుగా నితిన్ చిత్రం తమ్ముడు వస్తుందని చిత్ర టీమ్ ప్రకటించింది.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ "తమ్ముడు". ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు "తమ్ముడు" సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు క్రియేటివ్ గా, ఎంటర్ టైనింగ్ వీడియోతో తెలిపారు.
 
"తమ్ముడు" మూవీ ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ వీడియో ఫన్నీగా డిజైన్ చేశారు. తాను గట్టిగా అడిగినందు వల్లే ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించారని, ట్రైలర్ రిలీజ్ చేయమని అడిగితే చేస్తారని హీరోయిన్ వర్ష బొల్లమ్మ చెప్పగా, తాను అడిగితేనే మూవీ రిలీజ్ డేట్ చెప్పారని లయ అంటుంది. వీళ్లిద్దరితో పోటీ పడుతూ స్వసిక విజయన్, సప్తమి గౌడ, బేబి శ్రీరామ్ దిత్య తాము చెప్పడం వల్లే "తమ్ముడు" మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారని అంటారు. ఇలా వీళ్లు గొడవ పడుతుండగా, దర్శకుడు శ్రీరామ్ వేణు వచ్చి 'మీ డౌట్స్ అన్నీ క్లారిఫై కావాలంటే ట్రైలర్ చూడండి.' అని చెప్తాడు. ట్రైలర్ అనౌన్స్ మెంట్ ఇలా సరికొత్తగా డిజైన్ చేయడం మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.
 
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది. హీరో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా..దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో "తమ్ముడు" సినిమా వస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ను "తమ్ముడు" సినిమాతో అందించబోతున్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments