Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్ ముద్ర ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (13:19 IST)
నిఖిల్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ముద్ర. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతుంది. డ‌బ్బింగ్ ప‌నుల‌ను కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు. వాస్త‌విక సంఘ‌ట‌న‌ల ఆధారంగా జ‌ర్న‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. స‌మాజంలో జ‌రుగుతున్న కొన్ని విష‌యాల‌ను ఎలా మీడియా ప‌రిష్క‌రిస్తుంది. అందులో మీడియా బాధ్య‌త‌ను గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు టిఎన్ సంతోష్. లావ‌ణ్య త్రిపాఠి తొలిసారి నిఖిల్ తో జోడీక‌ట్టింది. ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ అర్జున్ సుర‌వ‌రంగా న‌టిస్తున్నారు. 
 
ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా మ‌రియు రాజా ర‌వీంద్ర ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి సంస్థ‌ల‌పై కావ్య‌ వేణుగోపాల్, రాజ్ కుమార్ ముద్ర సినిమాను నిర్మిస్తున్నారు. బి మ‌ధు ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌కు చేరుకుంది. నవంబర్ నెలలో ఈ మూవీ  విడుదల కానుంది.
 
నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: టిఎన్ సంతోష్, స‌మ‌ర్ప‌కుడు: బి మ‌ధు, నిర్మాత‌లు:  కావ్య‌ వేణుగోపాల్ మ‌రియు రాజ్ కుమార్, నిర్మాణ‌ సంస్థ‌లు: ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి, సినిమాటోగ్ర‌ఫీ: సూర్య, సంగీతం: శ్యామ్ సిఎస్, ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్, ఫైట్స్: వెంక‌ట్, క్యాస్ట్యూమ్ డిజైన‌ర్:  రాగా రెడ్డి, డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్: ర‌మా ర‌మేష్, రంగ‌నాథ్, లోకేష్, భ‌ర‌త్, అరు, బ్ర‌హ్మ, ప‌బ్లిసిటీ డిజైన్: అనిల్-భాను, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments