Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినీ ఛాన్స్ ఇవ్వమని అడిగితే ఆ నిర్మాత డ్రగ్స్ ఇచ్చి రేప్ చేశాడు...

సినీ ఛాన్స్ ఇవ్వమని అడిగితే ఆ నిర్మాత డ్రగ్స్ ఇచ్చి రేప్ చేశాడు...
, శుక్రవారం, 12 అక్టోబరు 2018 (16:30 IST)
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని 'మీటూ' ఉద్యమం కుదిపేస్తోంది. మీటూ ఉద్యమంలో భాగంగా రోజుకొక బాధితురాలు బయటకు వచ్చి తమపై జరిగిన అఘాయిత్యాలను వివరిస్తున్నారు.
 
తాజాగా సినీ ఛాన్సుల కోసం వచ్చిన ఓ మహిళను బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ మత్తుమందిచ్చి అత్యాచారం చేసినట్టు బాధిత మహిళ ఆరోపణలు చేసింది. అతనిపై బాధితురాలు ఫిర్యాదు చేయగా ప్రస్తుతం మొరానీ బెయిల్‌పై బయటకు వచ్చాడు. 
 
గతంలో 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'రావన్', 'హ్యాపీ న్యూ ఇయర్‌' వంటి భారీ చిత్రాలను నటించిన బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ. ఈయనతో ఈయన కుటుంబ సభ్యులు తెలియడంతో బాధిత మహిళ సినీ అవకాశాల కోసం 2014లో ముంబైకి వెళ్లింది. 
 
ఆ తర్వాత సినిమాల్లో నటించాలన్న ఆశతో కరీం దగ్గరకు వెళ్ళగా ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో మొరానీ వైన్ బాటిల్‌తో ఇంటికి వచ్చాడు. నేను తాగను అన్నా కూడా బలవంతంగా తాగించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నాకేమీ గుర్తు లేదు. ఉదయం 4 గంటల సమయంలో మెలుకువ వచ్చి చూడటంతో మొరానీ అక్కడ లేడు. నా ఒంటిపై కొన్ని మరకలు కనిపించాయి. నేను పూర్తిగా షాక్‌కు గురయ్యాను అని ఆమె వివరించింది. 
 
ఆ తర్వాత కూడా ఈ విషయంపై మొరానీని నిలదీస్తే బెదిరింపులకు దిగాడని బాధితురాలు ఆరోపించింది. నీ ఫొటోలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎవరికైనా ఈ విషయం చెబితే అండర్‌వరల్డ్ సాయంతో నిన్ను చంపేస్తా అన్నాడు. అతనికి అండర్‌ వరల్డ్‌తోనూ సంబంధాలు ఉన్నాయి. తర్వాత కూడా ఇలాగే ఎన్నోసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు అని ఆమె చెప్పింది. ఈ యువతి గతంలోనూ హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొరానీపై ఫిర్యాదు చేసింది. అప్పట్లో మొరానీపై రేప్ కేసు నమోదైంది. ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉన్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాజల్ అగర్వాల్ కూడా #MeeToo అనేసింది... ఏం చెప్పిందో చూడండి...