Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూతురిపై అత్యాచారం.. జననాంగంలో కత్తి?

మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావివరుసలు లేకుండా, వయోబేధం లేకుండా కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో ఓ కామపిశాచి.. కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.

Advertiesment
కూతురిపై అత్యాచారం.. జననాంగంలో కత్తి?
, శుక్రవారం, 5 అక్టోబరు 2018 (10:43 IST)
మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావివరుసలు లేకుండా, వయోబేధం లేకుండా కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో ఓ కామపిశాచి.. కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కామాంధుడు తన చేతులారా కన్నకూతురు జీవితాన్ని నాశనం చేశాడు.


పదేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడుతూ.. ఆమెను రెండుసార్లు తల్లిని చేశాడు. ఒకసారి మద్యం తాగించి, మరోసారి కడుపుపై తన్ని గర్భస్రావం అయ్యేలా చేశాడు. ఈ దుర్ఘటన ఢిల్లీలోని మంగోల్‌పురిలో చోటుచేసుకుంది. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మంగోల్‌పురికి చెందిన యువతి తన తండ్రి 2008 నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడని, మొబైల్‌లో బ్లూఫిల్మ్‌లు చూపించి అత్యాచారం చేసేవాడని.. ఆ దుర్మార్గుడి చర్య వల్ల 2011, 2013లో తాను గర్భం దాల్చినట్లు ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. 
 
రెండుసార్లు గర్భం వస్తే..దారుణంగా ప్రవర్తించి గర్భస్రావం అయ్యేలా చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నప్పుడు అతడి చేష్టలు అర్థం అయ్యేవి కావని.. ఊహ తెలిసిన తర్వాత తండ్రి పైశాచికం తెలిసిందని.. నాటి నుంచి ఈ చర్యను వ్యతిరేకించడం మొదలుపెట్టానని తెలిపింది. 
 
కానీ తన తండ్రి తన తల్లితో గొడవపడేవాడని.. తన తల్లికి వాడికి అడ్డు చెప్పడంతో ఆమెను దారుణంగా కొట్టేవాడని బాధితురాలు వాపోయింది. అంతేగాకుండా తన మాట వినకుంటే కూతురు జననాంగంలో కత్తి లేదా పగిలిన మద్యం సీసా పెడతానని తల్లిని బెదిరించేవాడని.. అతని బెదిరింపులతో తల్లి కూడా మౌనంగా ఉండిపోయేదని వాపోయింది.
 
తన వల్ల ఇంట్లో గొడవలు జరగకూడదనే ఉద్దేశ్యంతో తండ్రి పైశాచికాన్ని భరించానని..అయితే తన స్నేహితులతో గడపాల్సిందిగా తండ్రి ఒత్తిడి తెచ్చేవాడని.. అతని వేధింపులు భరించలేక ఒకసారి ఆత్మహత్యకు సైతం ప్రయత్నించానని.. తన తల్లి ప్రాణాలు కాపాడిందని వివరించింది. 
 
అయితే చివరకు ఫేస్‌బుక్ ఫ్రెండ్‌కు తన గోడు వెళ్లబోసుకున్నానని..తన ఫ్రెండ్ సాయంతో ఇంట్లోంచి తప్పించుకుని నాగ్‌పూర్‌కు చేరుకుని.. చైల్డ్ లైన్ ప్రతినిధులకు ఫిర్యాదు చేశానని చెప్పింది. సదరు కామాంధుడిపై సెప్టెంబర్ 30న పాలం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రెండ్స్‌తో పందెం కట్టి ఇంజనీరింగ్ యువతి నగ్న వీడియో... తర్వాత ఏం జరిగిందంటే...