Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా డాటర్ నీహారిక "హ్యాపీ వెడ్డింగ్" ఆగినట్టేనా?

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారిక. 'ఒక మనసు' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రం నిరాశపరిచినప్పటికీ... నటనాపరంగా నీహారిక మంచి మార్కులు కొట్టేసింది.

Webdunia
ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (12:17 IST)
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారిక. 'ఒక మనసు' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రం నిరాశపరిచినప్పటికీ... నటనాపరంగా నీహారిక మంచి మార్కులు కొట్టేసింది. ఈనేపథ్యంలో ఆమె నటిస్తున్న రెండో చిత్రం "హ్యాపీ వెడ్డింగ్". ఈ చిత్రం షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. నిజానికి ఈ చిత్రం గత మార్చి నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, ఇపుడు ఈ సినిమా రిలీజ్‌పై ప‌లు సందేహాలు నెల‌కొన్నాయి.
 
ముందుగా మార్చిలో విడుద‌ల‌వుతుంద‌ని అనుకున్న 'హ్యాపీ వెడ్డింగ్' చిత్రం సమ్మర్ రేస్‌లో ఉంద‌ని అన్నారు. కానీ విడుదలకు సరైన తేదీలు విడుదలకు అందుబాటులో లేకపోవడంతో ఈ చిత్రం విడుదలలో జాప్యం నెలకొంది. ముఖ్యంగా, నిహారిక‌, సుమంత్‌ల కాంబినేష‌న్‌పై సినీ ప్రేక్షకుల్లో పెద్ద‌గా క్రేజ్ లేక‌పోవ‌డంతో సినిమా రిలీజ్‌కి బ్రేక్ ప‌డింద‌నే టాక్ లేకపోలేదు. 
 
చిత్ర నిర్మాత‌లుగా యూవీ క్రియేషన్స్‌లాంటి భారీ సంస్థ ఉన్నా ఈ మూవీకి హైప్‌ తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు లేకపోలేదు. అదేసమయంలో ఈ సినిమా రిజల్ట్ పట్ల నిహారికకు మంచి నమ్మకం ఉండటంతో ఈ మూవీని ఏదో విధంగా ఈ సమ్మర్ రేస్‌లో విడుదల చేయించడానికి మెగా కాంపౌండ్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
కాగా, సుమంత్ అశ్విన్‌, నిహారిక హీరో హీరోయిన్స్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ట్టు తెలుస్తుంది. పల్లెటూరు... ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, ఫిబ్రవరి 14వ తేదీ అయిన ప్రేమికుల దినోత్సవం రోజున ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments