Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 'సైరా'లో నిహారిక పాత్ర ఇదే...

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (15:37 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు.. అనేక మంది టాలీవుడ్, కోలీవుడ్‌ స్టార్లు నటిస్తున్నారు. ఇందులో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, టాలీవుడ్ హీరోయిన్ నిహారిక కొణిదెల కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ పాత్రకు సంబంధించిన వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. 
 
ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నిహారిక కొణిదెల నటిస్తోంది. ఓ గిరిజన యువతి పాత్రలో నిహారిక కనిపించనుందని తెలుస్తోంది. 'సైరా నరసింహారెడ్డి'కి ఆపద సమయంలో ఆశ్రయం కల్పించే యువతిగా నిహారిక రెండు సీన్స్‌లో కనిపిస్తుందట. ఇటీవలే నిహారికకు సంబంధించిన షూటింగ్‌ను కూడా చిత్రబృందం పూర్తి చేసిందని తెలుస్తోంది.
 
కాగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో అమితాబ్‌తో పాటు జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments