Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగార్జున మేనకోడలితో పెళ్లా? పుకార్లపై క్లారిటీ ఇచ్చిన 'గూఢచారి' హీరో

Advertiesment
నాగార్జున మేనకోడలితో పెళ్లా? పుకార్లపై క్లారిటీ ఇచ్చిన 'గూఢచారి' హీరో
, బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (14:28 IST)
గూఢచారితో హిట్ కొట్టి విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన హీరో అడవి శేష్ పెళ్లి గురించి ప్రస్తుతం ఒక వార్త హల్‌చల్ చేస్తోంది. గూఢచారిలో తనతో పాటు నటించిన సుప్రియను అడవి శేష్ పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో వార్త హల్‌చల్ చేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు, చాలా కాలం నుండి అడవి శేష్ షాకింగ్ న్యూస్ చెబుతా అంటూ సోషల్ మీడియాలో ఆసక్తి కరమైన పోస్ట్‌లు పెడుతుండటంతో జనం తమకు తోచింది ఊహించుకుని వాటిని షేర్ చేసేసుకున్నారు.
 
అయితే తాజాగా అడవి శేష్ దీనిపైన క్లారిటీ ఇచ్చేసాడు. సోషల్ మీడియాలో తనకు సుప్రియకు వివాహం జరగబోతున్నట్లు వస్తున్న వార్తలు ఒట్టి పుకార్లే అని కొట్టిపారేసాడు. ఫేక్ న్యూస్... బాధ్యతా రాహిత్యం అంటూ ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డాడు. ప్రస్తుతం తన జీవితంలో ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే అది సినిమానే అన్నారు. రచయితగా కూడా తాను చాలా సంతృప్తిగా ఉన్నట్లు, ఇవి తప్ప తాను వేరే విషయాల జోలికి పోదలచుకోలేదని తేల్చి చెప్పాడు.
 
తమాషా ఏమిటంటే నిన్న నాగార్జున జగన్‌తో భేటీ అయిన సందర్భంలో సుప్రియ, శేష్‌ల పెళ్లికి శుభలేఖ ఇవ్వడానికే నాగార్జున జగన్ దగ్గరకు వెళ్లారని మరో పుకారు కూడా సోషల్ మీడియాలో వచ్చింది. మొత్తానికి అడవి శేష్ క్లారిటీతో ఇవన్నీ కేవలం పుకార్లే అని తేలిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోస్ట్‌కి నోటు... ‘కోబ్రాపోస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్‌లో చిక్కిన బాలీవుడ్ సెలెబ్రిటీలు