Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్‌కు ఆస్కార్ అవార్డ్... రుతుక్రమం సమయంలో?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (13:09 IST)
ఆస్కార్ పండుగ మొదలైంది. ఇందులో భారతీయ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు లభించింది. ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా, రేకా జెహతాబ్చి దర్శకత్వంలో నిర్మించిన 'పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌' సినిమా ఆస్కార్ న్యాయ నిర్ణేత మనస్సును గెలుచుకుంది. తద్వారా అమెరికాలో జరిగే ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఈ అవార్డును ఈ సినిమా గెలుచుకుంది. 
 
భారత్‌లో పలు ప్రాంతాల్లోని అమ్మాయిలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులకు మోంగా ఇచ్చిన దృశ్య రూపమే ఈ డాక్యుమెంటరీ. 25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ ప్రాంతంలో తెరకెక్కించారు. ఈ  ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్‌ నాప్‌కిన్లు ఎలా తయారు చేస్తారు, వాటిని అతి తక్కువ ధరకు అమ్ముతూ ఇతరులకు ఎలా సాయపడతారని ఈ డాక్యుమెంటరీలో చూపించారు. 
 
ఈ సినిమా ఆస్కార్ గెలుచుకున్న సందర్భంగా దర్శకులు రేకా జెహతాబ్బి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యపై తాను డాక్యుమెంటరీ తీస్తే ఆస్కార్‌ అవార్డు వచ్చిందంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. దీంతో ఈ సినిమా యూనిట్ మొత్తం హర్షం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఈ డాక్యుమెంటరీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments