Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.లక్ష బహుమతి ఇస్తానంటున్న నిధి అగర్వాల్!

Webdunia
గురువారం, 13 మే 2021 (10:43 IST)
వెండితెరకు పరిచయమైన అనతికాలంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్. అలాగే, తమిళంలోనూ అనేక చిత్రాల ఆఫర్లు చేతిలోవున్నాయి. 
 
అలాంటి నిధి అగర్వాల్‌కు తాజాగా ఓ సమస్య వచ్చిపడింది. తాను అల్లారుముద్దుగా పెంచుకునే పెంపుడు కుక్క కనిపించకుండా పోయిందని, దాని ఆచూకీ తెలిపిన వారికి అక్షరాలా లక్ష రూపాయల బహుమతి అందజేస్తానని ప్రకటించింది. పైగా, ఆ కుక్క ఫొటోతో పాటు ఆచూకీ తెలిసిన వారు ఫోను చేయాల్సిన నంబ‌రును ఆమె పోస్ట్ చేసింది.
 
ఆ కుక్క త‌న‌ పెంపుడు కుక్కేనా అన్న విష‌యాన్ని ఆమె తెలప‌లేదు. కుక్క ఆచూకీ చెబితే ఏకంగా ల‌క్ష రూపాయ‌లు ఇస్తామ‌ని ఆమె చేసిన పోస్టు వైర‌ల్ అవుతోంది. పూరీ జ‌గ‌న్నాథ్‌-రామ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ "ఇస్మార్ట్ శంక‌ర్" సినిమాలో న‌టించి మెప్పించిన‌ నిధి అగ‌ర్వాల్‌కు వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్న విషయం తెల్సిందే. 
 
త‌మిళంలో ఆమె న‌టించిన‌ రెండు సినిమలు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆమె చేతిలో గల్లా అశోక్ హీరోగా న‌టిస్తోన్న సినిమాతో పాటు, పవన్ కల్యాణ్ న‌టిస్తోన్న "హరి హర వీర మల్లు" సినిమా కూడా ఉంది. 
 

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments