రాశికంటే వాసి గొప్పదని నమ్మే వ్యక్తి తొట్టంపూడి కృష్ణ.(టి. కృష్ణ). 1927 అక్టోబర్ 21న ప్రకాశం జిల్లా టంగుటూరి మండలం కాకుటూరివారి పాలెంలో జన్మించారు. కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన ఈయనకు బేంక్ ఉద్యోగి పోకూరి బాబూరావు పరిచయంతో సినిమాలకు దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగాడు. చేసిన చిత్రాల సంఖ్య తక్కువే అయినా అవి సంచనాలు క్రియేట్ చేశాయి.
ఎన్నో సామాజిక అంశాలను పూసగుచ్చినట్లు చూపించి పాలకుల అవినీతి అరాచకాలపై తూటాలను ఎక్కుపెట్టేలా చేశాడు. అందుకేనేమో మృత్యువు కూడా ఆయనపై కన్నేసిందని ఆయన చనిపోయిన సందర్భంగా విజయశాంతి పలికి పలుకులు ఇప్పటికీ ఆ కుటుంబంలో గుర్తిండిపోయాయి. ఎన్నో పోరాట చిత్రాలు తీసిన ఆయన కేన్సర్ వ్యాధితో చేసిన పోరాటంలో విఫలమయ్యాడు. 1987 మే8న తుదిశ్వాస విడిచారు. నేడు ఆయన వర్థంతి ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
తొలి అడుగు
1927లో గుత్తా రామినీడు దగ్గర అసోసియేట్ దర్శకునిగా తల్లీకూతుళ్ళు చిత్రానికి పనిచేశారు. కానీ అక్కడ సినిమా వాతావరణం నచ్చక తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. తన మేనమామ పొగాకు వ్యాపారం చూసుకునేవాడు. అయినా సమాజంలోని పోకడలపై ఏదో తెలీని ఆవేదన. దాన్ని తన కలంతో పేపర్‌పై పెట్టేవాడు. అవి వినేవారు తక్కువ. అలాంటి సమయంలో బేంక్ ఉద్యోగి పోకూరి బాబూరావుతో ఏర్పడిన పరిచయం మలుపుతిప్పింది. ఇద్దరూ కమ్యూనిస్టు భావాలు గలవారే. తర్వాత పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. అలా వారి ప్రయాణం ఈతరం బేనర్ స్థాపించి సినిమాలు నిర్మంచడానికి బాబూరావు సహకరిస్తే దర్శకుడిగా కృష్ణ చేశారు.
ప్రతిఘటనకు తొలి అడుగు అక్కడే
తొలి సినిమాగా `నేటి భారతం` తీశారు. దానికి నంది అవార్డు కూడా దక్కింది. ఇక ప్రతిఘటన సినిమా కథ చాలా చిత్రంగా సెట్ అయింది. మదరాసులో పాండిబజార్లో సినిమావాళ్ళంతా ఓ హోటల్‌కు భోజనానికి వచ్చేవారు. అక్కడ తన మిత్రులతో కథ గురించి టి. కృష్ణ చర్చిస్తుండగా పక్కనే టేబుల్‌పై భోజనం చేస్తున్న ఉషాకిరణ్ మూవీస్‌కు సంబంధించిన అట్లూరి రామారావు వీల్ళ సంభాషణలు విన్నారు. వీరిలో నిబద్ధత నచ్చి మరుసటి రోజు రామోజారావుకు పరిచయం చేశారు. అలా ప్రతిఘటన మొదలైంది.
రామోజీరావుగారు మెచ్చుకున్నారు
ఆ సినిమాలో ఓ రౌడీ, ఎంఎల్.ఎ.గా నిలబడి గెలుస్తాడు. విజయశాంతి అతని వల్ల మోసపోతుంది. అలాంటిది అతన్ని సన్మానించే క్రమంలో విజయశాంతి చేసిన ఉపన్యాస సంభాషణలు చిత్రానికి హైలైట్ అయ్యాయి. ఎం.ఎల్.ఎ. ఎంతోమంది హత్యచేసి ఈ స్థాయికి వచ్చారు. అలాంటిది ఇంకా ఎన్నో హత్యలు చేయాలి. అవినీతిని, అక్రమాలను అంటూ పొగుడుతూ మరోవైపు ఉద్రేకమైన ప్రసంగంతో అతన్ని గొడ్డలి పెట్టి నరికేస్తుంది. ఈ సన్నివేశానికి కథ చెప్పినప్పుడు రామోజీరావుగారు ఫిదా అయిపోయారు. నేను ఎప్పటినుంచో ఇలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నానంటూ.. అది నీ రూపంలో వచ్చిందని కితాబిచ్చారు. ఇక ఆ సినిమా ఒక ట్రెండ్ సృష్టించింది ఆనాడు.
వందేమాతరం వరుస మారుతోంది
ఇలా ఒకటేమిటీ ప్రతి సినిమాలోనూ తన ఆవేదనను, ఆలోచనను, సమాజ బాధను ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్ని ఎలుగెత్తి చాటారు. వందేమాతరంలో వందేమాతరం వరస మారుతోంది. తరం మారుతోంది. స్వరం మారుతోందంటూ... పాటలు సినిమాకు హైలైట్.
- ఇక అప్పట్లోనే దేశంలో దొంగలు పడ్డారంటూ.. పాటరూపంలో చెప్పిన ఆ సాహిత్యం ఇప్పటికీ ఇంకా కదలాడుతూనే వున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం రాజకీయ ముఖ చిత్రం కూడా అలానేవుంది. సుమన్, విజయశాంతి కాంబినేషన్‌లో రూపొందిన ఈ పాటలో`దేశంలో దొంగలు పడ్డారూ.. వీరి తస్సా దియ్యా, దేశాన్ని దోచుకుంటున్నారు.. వీరి గోతులు తీయా.. ఊసరివెళ్లి వేషం మారెనా.. అంటూ అప్పటి పాలకులను చీల్చిచెండాడాడు.
- దేవాలయంలో దేవాలయ ప్రవేశం గురించి ఆయన చెప్పిన విధానం చాలా బాగుంది. మలయాళంలోనూ ఓ సినిమాకు దర్శకత్వం వహించిన టి. కృష్ణ. తెలుగులో రేపటి పౌరులు సినిమా సరికొత్త ఒకవడి సృష్టించింది. పి.ఎల్. నారాయణ తన కొడుకు `అయ్యా నే చదువుకుంటా అంటే, బి.ఎ.లు. ఎం.ఎ.లు చేసినోళ్ళు సంకనాకిపోయారూ.. అంటూ పాట రూపంతో హృద్యంగా చూపించాడు కృష్న. ఇక నేటిభారతం ఎలా వుందో అప్పట్లోనే రుచి చూపించాడు. ఇలా వేళ్ళమీద లెక్కబెట్టే సినిమాలు తీసిన ఆయన తన సినిమాలను సంచలనాలు సృష్టించేలా చేశారు. కానీ కేనర్సర్ వ్యాధిన పడి ఆయన మే 8న పదమపదించారు.