Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెట్‌ఫ్లిక్స్‌లో మిలియన్స్ ఆఫ్‌‌ వ్యూస్‌ సాధించిన ‘వైల్డ్‌డాగ్‌’.

Advertiesment
నెట్‌ఫ్లిక్స్‌లో మిలియన్స్ ఆఫ్‌‌ వ్యూస్‌ సాధించిన ‘వైల్డ్‌డాగ్‌’.
, శనివారం, 24 ఏప్రియల్ 2021 (16:53 IST)
wild dog-1
కోవిడ్ సెకండ్‌వేవ్‌కి భ‌య‌ప‌డి నాగార్జున న‌టించిన‌ `వైల్డ్‌డాగ్` సినిమాని ‌ఎక్కువ మంది థియేటర్స్‌లో చూడ‌లేదు. కానీ ఇప్పుడు ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. స్ట్రీమింగ్‌ స్టార్ట్‌ అయినప్పటినుంచే ఈ సినిమాకు వ్యూయర్స్‌ నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల వెర్షన్స్‌ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండ‌డం విశేషం. వైల్డ్‌డాగ్‌ తెలుగు వెర్షన్‌ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉండడాన్ని బట్టి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎంత పాజటివ్‌ రెస్పాన్స్‌ వస్తుందో తెలుస్తుంది. ఇతర భాషల వెర్షన్స్‌ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. తమిళ వెర్షన్‌ దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి ఐదో స్థానంలో ఉంది. 
 
ప్యాన్‌ ఇండియా అప్పీల్‌, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించడంతో  దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ‘వైల్డ్‌డాగ్‌’  సినిమాకు కనెక్ట్‌ అవుతున్నారు. దీంతో ఈ సినిమా ఓటీటీ వ్యూయర్స్‌ పరంగా ఓ సరికొత్త రికార్డును క్రియేట్‌ చేస్తుంది. ఇప్పటికే మిలియన్స్‌కి పైగా వ్యూయర్స్‌‘వైల్డ్‌డాగ్‌’ సినిమాను స్ట్రీమింగ్‌ అవుతున్నప్పటి నుంచి వీక్షించారు. రానున్న రోజుల్లో ‘వైల్డ్‌డాగ్‌’ సినిమాకు వ్యూయర్స్‌ పరంగా మరింత క్రేజ్‌ రానుంది. నెటిఫ్లిక్స్‌లో ఇప్పటికే మిలియన్స్ ఆఫ్‌‌ వ్యూస్‌తో దూసుకెళ్తున్న వైల్డ్‌డాగ్‌ చిత్రం తెలుగులో టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది. తమిళంలో టాప్‌ ఫైవ్‌లో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లోని సౌత్‌ఇండియన్‌ మూవీస్‌లో ఫాస్టెస్ట్,‌ హాయ్యేస్ట్‌ మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌ సాధించిన చిత్రంగా ‘వైల్డ్‌డాగ్‌’ నిలిచిందని నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిథులు పేర్కొన్నారు.

భారతదేశంలో జరిగిన బాంబు పేలుళ్ళు, అసాంఘీక కార్యకలపాలకు కారణమైన ఓ ఉగ్రవాదిని విదేశాల్లో పట్టుకుంటారు ధైర్యవంతులైన ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్విస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారులు. అతన్ని ఇండియా తీసుకురావాడానికి ఎన్‌ఐఏ ఆఫీసర్లు ఎలాంటి సాహసాలు చేశారు? ఏ ప్రణాళికలు రచించారు? అన్న అంశాల నేపథ్యంలో వైల్డ్‌డాగ్‌ సినిమా రూపొందించబడంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకె క్కించారు దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌. దేశం కోసం ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధమైన సైనికులు, అమరవీరులకు ఈ సినిమాను ఓ నివాళిగా చెప్పుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలియానాకు అలాంటి రోల్స్ కావాలంట..? డైరక్టర్లు ఛాన్స్ ఇస్తారా?