Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక నిర్ణయం తీసుకున్న ప్రియాంకా చోప్రా - నిక్ జోనాస్!

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (09:20 IST)
తన కంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికా సింగర్ నిక్ జోనాస్‌ను బాలీవుడ్ నటి ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత యేడాది డిసెంబ‌రు ఒకటో తేదీన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఉమాయిద్ భవన్ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో ఘ‌నంగా జరిగిన విషయం తెల్సిందే. ఆ త‌ర్వాత హిందూ సంప్రదాయంలోను వేడుక జ‌రిపించారు. దాదాపు నెల రోజుల పాటు వీళ్ళ పెళ్లి టాపిక్ బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఈ క్రమంలో ఈ జంట ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ భ‌విష్య‌త్‌ని దృష్టిలో పెట్టుకొని తామిద్ద‌రు ఇక‌పై హాట్ స‌న్నివేశాల‌లో న‌టించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. అడ‌ల్ట్ మూవీస్‌, షోస్‌, సిరీస్‌లాంటి వాటిలో ఇక‌పై న‌టించ‌బోమ‌ని తాజాగా నిక్ జోనాస్ ఓ హాలీవుడ్ ప‌త్రిక‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. కుటుంబం, పిల్ల‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టు వివరించాడు. 
 
ప్రియాంక - నిక్‌ల పెళ్ళి గురించి రోజుకో వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొట్టింది. అయితే త‌న క‌న్న ప‌దేళ్ళు చిన్న‌వాడైన అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా విడాకులు తీసుకోబోతుందంటూ ఇటీవల ఓ ప్రచారం సాగింది. 
 
ఈ పుకార్లకు ప్రియాంకా చోప్రా ఒక్క ఫోటోతో ఫుల్‍స్టాఫ్ పెట్టింది. నిక్‌తో పాటు.. వారి సోదరులు అంటే తన మరుదులతో కలిసి ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె విడాకులపై సాగిన వదంతులకు ఫుల్‌స్టాఫ్ పడ్డాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments