Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియాంకా చోప్రా పార్టీల పిల్లనా? నిక్ జోనాస్‌తో పెళ్లి మూణ్ణాల ముచ్చటేనా?

Advertiesment
Priyanka Chopra and Nick Jonas Are Heading for a Divorce?
, ఆదివారం, 31 మార్చి 2019 (07:17 IST)
బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌లు కొంతకాలం ప్రేమించుకుని, డేటింగ్ చేసి.. గత యేడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. ఢిల్లీలో జరిగిన రిసెప్షన్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సైతం హాజరయ్యారు. అయితే, పెళ్లై పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే వీరిద్దరూ విడాకులకు సిద్ధమవుతున్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది.
 
ఓ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ కథనం ప్రకారం ప్రియాంక, నిక్ విడాకులు తీసుకోబోతున్నారు. సాధారణంగా ప్రియాంక ఇతరులను అదుపు చేయాలని చూస్తుంది. అలాగే త్వరగా కోపం తెచ్చుకునే స్వభావం ఆమెది. ఇదే విడాకులకు ముఖ్య కారణంగా చెబుతున్నారు. 'ఇద్దరూ ప్రతి విషయానికి కొట్లాడుకుంటున్నారు. పని, పార్టీ, ఒకరితో ఒకరు సమయం గడపడం.. ప్రతి విషయం మీద కొట్లాటే. ఇద్దరూ త్వరపడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు దానికి మూల్యం చెల్లిస్తున్నారని' ఆ కథనంలో పేర్కొన్నారు.
 
'ప్రియాంక పెళ్లి తర్వాత స్వభావం మారి కొంత నెమ్మదిగా మారుతుందని, నటించినట్టు కాకుండా కాస్త సహజ ధోరణికి వస్తుందని నిక్ భావించాడు. కానీ ఇటీవలే తనని ప్రియాంక చట్రంలో బంధించి ప్రతి దానికీ ఆంక్షలు విధిస్తున్నట్టు నిక్ ఫీలవుతున్నాడు. పీసీ త్వరగా కోపం తెచ్చుకుంటుంది. ఈ సంగతే నిక్‌కి తెలియదు. ఇవన్నీ చూసి నిక్ కుటుంబం కూడా ఈ పెళ్లిని రద్దు చేసుకోమని సూచిస్తున్నారు. 
 
నిజానికి తొలుత ప్రియాంక చోప్రా పరిపక్వత కలిగిన మహిళగా నిక్ కుటుంబ సభ్యులు భావించారు. ఆమె ఇంటి వ్యవహారాలు చక్కబెట్టేందుకు, పిల్లలను పెంచేందుకు సిద్ధంగా ఉందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె కేవలం పార్టీలు చేసుకొనే అమ్మాయి మాత్రమేనని వారికి తెలిసిపోయింది. తను ఇంకా 21 ఏళ్ల అమ్మాయి మాదిరిగా ప్రవర్తిస్తోందని వాళ్లు భావిస్తున్నారు' అని రిపోర్ట్ తెలిపింది.
 
ఈ వార్తలన్నిటిని ప్రియాంక ప్రతినిధి ఖండించారు. ఈ వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం ప్రియాంక, నిక్ లాస్ ఏంజెల్స్‌లో నివసిస్తున్నారు. నిక్ 'జుమాంజీ'కి సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రియాంక అత్తారింటి వారితో బిజీగా ఉంటోంది. 'ద స్కై ఈజ్ పింక్' చిత్రంతో పిగ్గీ చాప్స్ బాలీవుడ్‌లో కమ్ బ్యాక్ చేయనుంది. ఇదికాకుండా సంజయ్ లీలా భన్సాలీ 'గంగూబాయీ'లో కూడా నటించే అవకాశం ఉన్నటట్టు ప్రియాకా ప్రతినిధి వెల్లడించారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొత్త సినిమాలు ఎనౌన్స్ చేసిన నితిన్..!