నా కుమారుడికి టీవీలు, కెమెరాలంటే భలే ఇష్టం.. సానియా మీర్జా

సోమవారం, 28 జనవరి 2019 (16:21 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తల్లైన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సానియా మీర్జా గత ఏడాది ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి విదితదే. ఈ చిన్నారికి ఇజాన్ మీర్జా మాలిక్ అని నామకరణం కూడా చేశారు. ఇప్పటికే సానియా మీర్జా, ఇజాన్ మీర్జా మాలిక్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా తన కుమారుడితో సానియా తీసిన మరో ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్వచ్ఛమైన ప్రేమను కుమారుడి నుంచి అందుకుంటున్నానని కామెంట్ చేసింది. ఇంకా తన ముద్దుల కుమారుడికి కెమెరాలు, టీవీలంటే చాలా ఇష్టమని.. ఇప్పుడే షోయబ్ మ్యాచ్ చూశామని సానియా తెలిపింది. ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. తల్లీ, కుమారులు చాలా అందంగా వున్నారని ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జయహో భారత్ : న్యూజిలాండ్‌ చిత్తు.. పదేళ్ళ తర్వాత వన్డే సిరీస్