Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై చేరుకున్న దీపిక - రణ్‌వీర్ దంపతులు

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (14:50 IST)
ఇటీవల మూడుముళ్ళబంధంతో ఒక్కటైన దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్‌లు ముంబైకు చేరుకున్నారు. వీరిద్దరి వివాహం తాజాగా ఇటలీలోని లేక్‌కోమోలో రెండు రోజుల క్రితం జరిగిన విషయం తెల్సిందే. న‌వంబ‌ర్ 14వ తేదీన కొంక‌ణి వివాహ ప‌ద్ద‌తిలో వీరి పెళ్లి వేడుక జ‌రుగ‌గా, 15న సింధీ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగింది. త‌మ పెళ్లికి సంబంధించి ఏ ఒక్క ఫోటో కూడా బ‌య‌ట‌కి రాకుండా చాలా సీక్రెట్‌గా వీరి వివాహం జ‌రిగింది. 
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం దీప్‌-వీర్ దంప‌తులు ముంబై చేరుకోగా ఎయిర్ పోర్ట్‌లో నూత‌న దంప‌తుల‌కి అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత ర‌ణ్‌వీర్ ఇంటి వ‌ద్ద కూడా అభిమానులు గుమికూడ‌గా వారికి దీప్‌వీర్‌లు బయటకు వచ్చి వారికి అభివంద‌నం చేశారు. 
 
నూత‌న దంప‌తులు ఇద్ద‌రు బంగారు వర్ణపు దుస్తుల్లో మెర‌వ‌డం విశేషం. ఈ నెల 21వ తేదీన బెంగళూరులో, 28వ తేదీన ముంబైలో వివాహ విందును ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత ఎప్పటిలా తమ సినీ కెరీర్‌పై దృష్టిసారించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments