Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సచిన్‌, ధోనీ రికార్డుల్ని బ్రేక్ చేశాడు.. రికార్డుల మోత మోగించిన రోహిత్ శర్మ..

సచిన్‌, ధోనీ రికార్డుల్ని బ్రేక్ చేశాడు.. రికార్డుల మోత మోగించిన రోహిత్ శర్మ..
, సోమవారం, 29 అక్టోబరు 2018 (18:35 IST)
భారత్-వెస్టిండీస్‌ల మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ అదరగొట్టేశాడు. భారత జట్టుకు భారీ స్కోర్ నమోదు చేసుకునే విధంగా ధీటుగా ఆడాడు. మొదటి నుంచే ఆచితూచి ఆడుతూ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత చెలరేగి ఆడుతూ కేవలం 137 బంతుల్లోనే 162 పరుగులు సాధించి ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రెండూ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌వే కావడం విశేషం. 
 
అవేంటంటే.. సిక్సర్ల విషయంలోనూ రోహిత్ సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. వన్డేల్లో సచిన్‌ పేరిట వున్న 195 సిక్సర్ల రికార్డును రోహిత్ అధిగమించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఒక్క సిక్సర్ దూరంలో నిలిచిన రోహిత్ ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాది సచిర్ రికార్డును బద్దలుగొట్టాడు. 
 
అలాగే ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఓ వైపు వికెట్లు పడుతున్నా తడబడకుండా భారత ఇన్నింగ్స్‌ను నిలబెడుతూ సెంచరీ సాధించాడు. దీంతో తన కెరీర్లో 21వ సెంచరీ  పూర్తిచేసుకున్నాడు. అయితే ఓపెనర్‌గా రోహిత్‌కు ఇది 19వ సెంచరీ. కేవలం 107 ఇన్నింగ్సుల్లోనే రోహిత్ ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ 115 ఇన్నింగ్సుల్లో శతకాన్ని సాధించాడు. 
 
అతడి కంటే వేగంగా 19 సెంచరీలు సాధించి రోహిత్ ఆ రికార్డును బద్దలుగొట్టాడు. ఇలా అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 19 సెంచరీలు సాధించిన భారత బ్యాట్ మెన్‌గా రోహిత్ నిలిచాడు. ఇలా ఓపెనర్‌గా అత్యధిక శతకాలు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా పేరిట వుంది. అతడు 102 ఇన్నింగ్సుల్లోనే 19 సెంచరీలు పూర్తిచేసుకున్నాడు. ఆమ్లా తర్వాతి రెండో స్థానంలో రోహిత్ నిలిచాడు. 
 
మొత్తంగా భారత్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్‌మెన్స్ జాబితాలో ఎంఎస్ ధోని (211 సిక్సర్లు) మొదటి స్థానంలో ఉండగా రోహిత్ 198 సిక్సర్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అమర్ అక్బర్ ఆంటోని' ట్రైలర్ అదుర్స్.. ''కిక్" సుందరి బొద్దుగా వుందే?