Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా చోప్రా ప్రియుడుకి టైప్ 1 డయాబెటిస్

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (14:42 IST)
బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా అమెరికా సింగర్ నిక్ జోనాస్‌ను త్వరలో పెళ్లి చేసుకోనుంది. వచ్చే నవంబరు నెలలో వీరి వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్‌పూర్ వేదికగా జరుగనుంది. ఈ నెలాఖ‌రు నుండి ప్రియాంక‌, నిక్‌ల పెళ్ళి సందడి మొదలుకానుంది. 
 
అయితే తాజాగా ప్రియాంక ప్రియుడు నిక్ జోనాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. త‌ను 13 ఏళ్ల క్రితం టైప్‌ 1 డయాబెటిస్ షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నట్టు డాక్టర్లు నిర్ధారించారట. ఆ విష‌యాన్ని అభిమానుల‌తో తెలియ‌జేస్తూ అప్ప‌టి, ఇప్ప‌టి ఫోటోని షేర్ చేశాడు. చికిత్స జరిగిన కొన్ని వారాల తర్వాత ఫొటో ఇది. 
 
శరీరంలో షుగర్‌ మోతాదు ఎక్కువ ఉండటంతో సుమారు 100 పౌండ్లు బరువు కూడా లేను అప్పుడు. కాని ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం, క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయ‌డం, రక్తంలో షుగుర్‌ లెవల్స్‌ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోవడం నా లైఫ్‌స్టైల్‌లో భాగం అయిపోయింది అని పోస్ట్‌లో తెలిపాడు నిక్ జోనాస్.
 
డ‌యోబెటిస్ ఉన్న‌ప్ప‌టికి నా ఆరోగ్యాన్ని ఎప్పుడు కంట్రోల్‌లో ఉంచుకున్నాను. ఆ స‌మ‌యంలో నాకు స‌హ‌క‌రించిన కుటుంబ స‌భ్యుల‌కి, స్నేహ‌తుల‌కి ధ‌న్య‌వాదాలు. స‌క్ర‌మంగా జీవించ‌నివ్వ‌ని దానిని మ‌న ద‌రి చేరనివ్వ‌కుండా త‌గు జాగ్ర‌త్తలు తీసుకోండి. నా అభిమానుల ప్రేమ‌, ఆదరణకి ఎల్ల‌ప్పుడు రుణ‌ప‌డి ఉంటాను అంటూ నిక్ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments