Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచ‌ర్స్ మీద సినిమాగా నీతోనే నేను సిద్ధం

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (14:47 IST)
Vikash Vasishta Moksha
‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు  హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మించిన  చిత్రం ‘నీతోనే నేను’. అక్టోబ‌ర్ 13న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మెద‌క్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
 
చిత్ర నిర్మాత ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ, కేవ‌లం 33 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. సింగిల్ షెడ్యూల్‌లో ప్లానింగ్ ప్రకారం మూవీని పూర్తి చేశాం. డైరెక్ట‌ర్ అంజి రామ్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తీక్‌, డాన్స్ మాస్ట‌ర్ అనీష్‌, కో డైరెక్ట‌ర్ కిర‌ణ్‌, సినిమాటోగ్రాఫ‌ర్ ముర‌ళీ మోహ‌న్‌గారు స‌హా అంద‌రికీ థాంక్స్‌. టీచ‌ర్స్ మీద సినిమా చేస్తున్నారేంటి అని ఈ జ‌ర్నీలో న‌న్ను చాలా మంది అడిగారు. అంటే మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌వ‌చ్చు క‌దా అనేది వాళ్ల అభిప్రాయం. కానీ నా ఉపాధ్యాయుల మీద‌, నా క‌థ మీద‌, నా టీమ్ మీద‌, నా మీద నాకు ఉన్న న‌మ్మ‌కంతో ముందుకు అడుగులు వేస్తూ వ‌చ్చాను. అక్టోబ‌ర్ 13న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధం చేశాను.   అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు అంజిరామ్ మాట్లాడుతూ ‘‘మెదక్‌లో ‘నీతోనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌టం చాలా ఆనందంగా ఉంది. నాలుగు నెల‌ల పాటు ఎంటైర్ టీమ్ క‌ష్ట‌ప‌డింది. అందువ‌ల్లే సినిమాను అక్టోబ‌ర్ 13న రిలీజ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌య్యాం. మా సినిమాటోగ్రాఫ‌ర్ ముర‌ళీ మోహ‌న్ రెడ్డిగారు, మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తీక్‌గారు ఈ జ‌ర్నీలో అందించిన స‌పోర్ట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. యాక్ట‌ర్స్‌ హీరో వికాస్ వశిష్ట‌, మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు, ఆకెళ్ల స‌హా  అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. ఇక నిర్మాత సుధాక‌ర్ రెడ్డిగారైతే మా వెనుకుండి ముందుకు న‌డిపించారు. ఇండ‌స్ట్రీలోకి కొత్త‌గా అడుగు పెట్టిన‌ప్ప‌టికీ ఆయ‌న డేడికేష‌న్, క‌మిట్‌మెంట్‌తో సినిమాను కంప్లీట్ చేశారు. ఆయ‌న అందించిన స‌పోర్ట్‌కి ధ‌న్య‌వాదాలు. కిర‌ణ్‌గారికి, తేజ‌గారికి, ఎడిట‌ర్ ప్ర‌తాప్ స‌హా టీమ్‌కి థాంక్స్‌. అక్టోబ‌ర్ 13న థియేట‌ర్స్‌లోకి వ‌స్తున్నాం’’ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments