Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్తంటివారిపై అలిగి కరెంట్ స్తంభమెక్కిన అల్లుడు ... ఎందుకో తెలుసా?

Advertiesment
Medak
, సోమవారం, 6 మార్చి 2023 (14:27 IST)
Medak
ఓ అల్లుడు అత్తమీద అలిగి కరెంట్ పోల్ ఎక్కాడు. అత్తింటి వారు బంగారం పెట్టలేదన్న కోపంతో అలిగి కొండెక్కాడు. ప్రేమించి పెళ్ళి చేసుకుంటే తనకు బంగారంతో పాటు కట్నకానుకలు ఇవ్వరా అంటూ ప్రశ్నించాడు. దీనికి అత్తింటివారు నుంచి స్పందన లేకపోవడంతో అలిగిన అల్లుడు ఏకంగా కరెంట్ పోల్ ఎక్కి కూర్చొన్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని గాంధీ నగరులో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గాంధీ నగర్‌కు చెందిన శేఖర్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. కొంతకాలం కింద శేఖర్ ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకన్నాడు. రోజులు గడిచిపోతున్నప్పటికీ.. కట్నకానుకలు ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆ శేఖర్... ఆదివారం అత్తగారింటికి వెళ్లినపుడు బంగారం విషయం ప్రస్తావించాడు. తాను అలిగినా, డిమాండ్ చేసినప్పటికీ అత్తింటివారు పట్టించుకోలేదు. దీంతో ఇంట్లో నుంచి బయటకొచ్చి రోడ్డు పక్కనే ఉన్న కరెట్ పోల్ ఎక్కి కూర్చొన్నాడు. 
 
బంగారం పెడితేనే కిందకు దిగుతానని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. అయితే, శేఖర్ కరెంట్ పోల్ ఎక్కడాన్ని గమనించిన స్థానికులు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ తర్వాత విద్యుత్ సిబ్బందికి, అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని, అత్తింటివారితో బంగారం ఇప్పిస్తామని శేఖర్‌కు హామీ ఇవ్వడంతో వారు కిందికి దిగాడు. దీంతో స్థానికులంతా ఊపిరిపీల్చుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి 31లోపు అనుసంధానం చేసుకోవాలి.. లేకుంటే రూ.1000 నుంచి రూ.10 వేల వరకు అపరాధం