Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎవరెస్టు శిఖరంపై తెలుగు దేశం పార్టీ జెండా.. ఎలా?

Advertiesment
tdp flag on Everest mountain
, ఆదివారం, 9 అక్టోబరు 2022 (11:29 IST)
ఎవరెస్టు శిఖరంపై తెలుగు దేశం పార్టీ జెండా రెపరెపలాడింది. 80 యేళ్ల శివప్రసాద్ అనే టీడీపీ వీరాభిమాని ఈ జెండాను ఎగురవేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దార్శనికుడు, రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించగలిగే నాయకుడైన చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలన్న తపన, పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని 5 వేల మీటర్ల వరకు 80 యేళ్ల వృద్ధుడు గింజుపల్లి శివప్రసాద్ అధిరోహించారు. 
 
అక్కడ టీడీపీ జెండాను ఎగురవేసిన తర్వాత తెలుగు ఓటర్లకు ఓ విజ్ఞప్తి చేశారు. "ప్రతి ఒక్క తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా మీ రాష్ట్రాన్ని, దేశాన్ని మరిచిపోకండి. ప్రస్తుతం మీ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో, దయనీయ స్థితిలో ఉంది. అందరికీ చెప్పి .. చంద్రబాబును గద్దెపై కూర్చోబెట్టండి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది" అని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాగా 80 యేళ్ల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన శివ ప్రసాద్‌ను టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో గణనీయంగా తగ్గిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు