Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురు హీరోయిన్లకు 'డ్రగ్స్ కేసు' నుంచి విముక్తి లభించినట్టేనా?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (12:23 IST)
దేశంలో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో పలువురు హీరోయిన్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారించింది. వీరిలో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధ కపూర్, సారా అలీఖాన్, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. ఈ ముగ్గురి వద్ద గంటల తరబడి విచారణ జరిపిన ఎన్సీపీ పలు కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం. అలాగే, వీరి ఫోన్లను కూడా సీజ్ చేసి విశ్లేషిస్తున్నారు. 
 
అయితే, ఈ విచారణ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకుంది. అలాగే, మిగిలిన ముగ్గురు హీరోయిన్లు దీపికా పదుకొనె, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌ల‌తో పాటు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్‌లు మాత్రం ముంబైలోనే ఉన్నారు. వీరందరికీ ఎన్సీబీ దాదాపుగా క్లీన్‌చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 
 
కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తిని ఎన్సీబీ అెరెస్టు చేసింది. ఆమె వద్ద జరిపిన విచారణలో మరికొంది హీరోయిన్లకు సంబంధం ఉన్నట్టు తేలింది. దీంతో వీరందరికీ సమన్లు జారీ చేసి విచారణ జరిపారు. 
 
అయితే, రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం రియా తెచ్చిన డ్రగ్స్‌ను తన ఇంట్లో దాచిపెట్టినట్టు అంగీకరించింది. రియా త‌న ఇంట్లో డ్ర‌గ్స్ దాచింద‌ని, తాను మాత్రం ఎప్పుడు డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని ర‌కుల్ చెప్ప‌గా, దీనిపై ఎన్సీబీ అధికారులు మ‌రింత దృష్టి పెట్టారు. మ‌రోసారి ర‌కుల్‌ని విచారించి కీల‌క ఆధారాలు రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. అదేసమయంలో దీపికా, సారా, శ్రద్ధాలకు మాత్రం ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చినట్టేనని ముంబై వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments