Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌస్‌లో ఇక్కడ అందరు దొంగలే.. అమ్మాయిలను అడ్డుపెట్టుకుని...?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (11:02 IST)
బిగ్ బాస్ హౌస్‌లో ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకుంటున్నాయి. హౌజ్‍లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అప్పుడే పోట్లాడతారు, అంతలోనే ఫ్రెండ్స్ అంతారు. ఇదంతా ప్రేక్షకులకు ఓ వింత ప్రపంచంలా కనిపిస్తుంది. అయితే సోమవారం రోజు నామినేషన్ ప్రక్రియ జరగగా, దానికి సంబంధించి కొద్ది సేపు డిస్కషన్‌ని మంగళవారం ఎపిసోడ్‌లో చూపించారు. ముందుగా నో మనీ నో మనీరా అనే సాంగ్‌కు స్టెప్పులేసారు ఇంటి సభ్యులు. ఆ తర్వాత మోనాల్‌, అఖిల్‌, స్వాతి దీక్షిత్ గార్డెన్ ఏరియాలో కూర్చొని ముచ్చట్లు పెట్టారు.
 
స్వాతి దీక్షిత్‌తో అఖిల్ మాట్లాడుతూ.. ఇంత అందంగా ఎలా ఉన్నారు, నేను అలా మారేందుకు ప్రయత్నించాలి అని అన్నాడు. అనంతరం నాకు కొన్ని కోరికలు ఉన్నాయని అఖిల్ చెప్పగా, అవి తీరతాయో లేదో స్వాతి తన కనురెప్ప వెంట్రుకని తీసి చెప్పింది. చేతి మీద వెంట్రుక ఉంచి మూడు సార్లు ఊదింది. మొదటి సారి అది ఎగరలేదు. రెండో సారి ప్రయత్నించింది. వెంట్రుక ఎగిరిపోయింది. దీంతో నువ్వు అనుకున్నవి తప్పక జరుగుతాయి అంటూ అఖిల్‌కు చెప్పుకొచ్చింది స్వాతి.
 
ఇక అభిజిత్‌, సోహైల్, నోయల్‌, మెహబూబ్ ఓ చోట కూర్చొని ఉండగా, ఉక్కు హృదయం టాస్క్ డిస్కషన్ వచ్చింది. ఆ టాస్క్‌లో సోహైల్.. అభిజిత్‌ని నోటికొచ్చినట్టు తిట్టడం విషయం గురించి చర్చించారు. నువ్వు మమ్మల్ని గల్లీ బాయ్స్ అంటే ఊరుకోవాలా?? అని సొహైల్ అనడంతో.. నీ బతుకు అని నన్ను అనలేదా?? అంటూ అభి అడిగాడు. ఇదే విషయంలో మాట మాట పెరగడంతో నువ్వు మగాడివి కాదు అని అనుకునేంత వరకు వెళ్ళింది.
 
ఆడపిల్లని అడ్డుపెట్టుకొని నువ్వు గెలిచావ్ అని సోహైల్ అనగా, అందుకు అభి ఆడ పిల్లలతో గీకించుకున్నావ్ నువ్ అన్నాడు. ఇందుకు సోహైల్ అమ్మాయిలతో ఆట ఆడించి పేరుకొట్టేశావ్.. కాస్త మగాడిలా ఆట ఆడు అంటూ సీరియస్ అయ్యాడు సొహైల్. ఇందుకు ఆడవాళ్లతో గీకించుకున్నవాడు మగాడా..? కండలు చూపిస్తే మగాడా? కండలు వాడటం కాదు బుర్ర కూడా వాడు అని అభి అన్నాడు. దీనికి సోహైల్ అమ్మాయిలు ఆడుతున్నారు, నీకు దమ్ము లేదంటూ కౌంటర్ ఇచ్చాడు.
 
సోహైల్, అభిజిత్ మధ్య మాటా మాటా పెరుగుతున్న సమయంలో మెహబూబ్ దూరాడు. ఆయనకు క్లారిటీ ఇచ్చిన అభిజిత్‌, మళ్ళీ నోయల్‌తో డిస్కషన్ జరిపాడు. ఈ క్రమంలో సోహైల్.. ఫిజికల్ టాస్క్ అంటే భయపడతావు నువ్వు, బిగ్ బాస్ ఇంకోసారి అభిజిత్‌కు ఫిజికల్ టాస్క్ ఇవ్వకండి భయపడుతున్నాడు. ఇచ్చినా కూడా అమ్మాయిల్ని పెట్టే ఆడతాడు అని సీరియస్‌గా చెప్పేసి అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు సొహైల్. ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ గురించి కొద్ది సేపు మిగతా ఇంటి సభ్యులతోను డిస్కస్ చేశాడు సోహైల్.
 
ఇక కెప్టెన్ టాస్క్ సమయం ఆసన్నం కాగా, ఈ టాస్క్‌లో బజర్ మోగగానే ఇంటి సభ్యులపై నుండి పడే కాయిన్స్ ఏరుకోవాలి. ఎవరు ఎక్కువ దక్కించుకుంటే వారే బిగ్ బాస్ ఇంటికి కెప్టెన్ అవుతారని చెప్పారు. ఇక టాస్క్ మొదలు కాగానే రంగంలోకి దిగారు ఇంటి సభ్యులు. కొందరు కలిసి ఆడగా, మరి కొందరు సోలోగా ఆడారు. ఇదే క్రమంలో కొందరు దాచుకున్న కాయిన్స్‌ని దొంగిలించడం కూడా మొదలు పెట్టారు.
 
సోహైల్‌ని దివి దొంగ అనడంతో మనోడి కోపం కట్టలు తెంచుకుంది. కుమార్ సాయి దగ్గర ఉన్న కాయిన్స్ కొట్టేసి నువ్వేదో పత్తిత్తులా మాట్లాడుతున్నావ్‌. ఇక్కడ అందరు దొంగలే అంటూ కొద్ది సేపు తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. లాస్యతో కూడా ఇదే విషయంపై చర్చించగా, ఇది నువ్వు ఇచ్చిన అలుసే అని చెప్పింది. అయితే అమ్మ రాజశేఖర్, అరియానా, హారిక, మెహబూబ్ ఇలా కొందరు ఓ జట్టుగా ఆడుతుంటే అఖిల్‌, మోనాల్ ఓ జట్టు, అభిజిత్‌, సాక్షి ఓ జట్టుగా ఉన్నారు. ఇది గమనించిన బిగ్ బాస్ వారికి వార్నింగ్ ఇచ్చారు.
 
ఎవరి ఆట వాళ్లు ఆడకుండా గ్రూప్‌లు గ్రూప్‌లుగా ఆడకూడదు. మీరు సరిగా చదివి గేమ్ ఆడండి అని బిగ్ బాస్ హెచ్చరించడంతో, మళ్ళీ సోలోగా ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ గేమ్ మధ్యలో అరియానా కాయిన్స్ మాస్టర్ దొంగిలించడం, కుమార్ సాయివి దివి, హారికవి సోహైల్ తీసుకోవడం జరిగాయి. ఈ రోజు కూడా కాయిన్స్ టాస్క్ జరగనుండగా, ఎవరు విజేతలుగా నిలిచి కెప్టెన్ బాధ్యతలు స్వీకరిస్తారనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments