Webdunia - Bharat's app for daily news and videos

Install App

షారుఖ్‌ జ‌వాన్ లో యాక్ష‌న్ అవ‌తార్‌లో న‌య‌న‌తార

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (10:07 IST)
Nayanatra-jawan
ప్రేక్ష‌కుల్లో రోజురోజుకీ ఘ‌నంగా అంచ‌నాలు క్రియేట్ చేస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జ‌వాన్‌. షారుఖ్‌ఖాన్ హీరోగా న‌టిస్తున్నారు.
 నానాటికీ జ‌నాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది జ‌వాన్ మూవీ. జ‌వాన్ నుంచి నెక్స్ట్ ఎలాంటి అప్‌డేట్ వ‌స్తుందా? అని ఆత్రుత‌తో ఎదురుచూస్తున్న అభిమానుల మ‌న‌సు తెలుసు కున్న మేక‌ర్స్ కొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. చూడ‌గానే స్ట‌న్నింగ్‌గా, యాక్ష‌న్ ప్యాక్డ్ అవ‌తార్‌లో మెప్పిస్తున్నారు న‌య‌న‌తార‌. జ‌వాన్ హీరోయిన్ న‌య‌న‌తార లుక్‌కి అంద‌రూ ఫిదా అవుతున్నారు. ప్రివ్యూలో ఆమె లుక్ చూసిన వాళ్లు సినిమాలో మ‌రో రేంజ్‌లో ఉండి తీరుతుంద‌ని ఫిక్స్ అయ్యారు. ఈ పోస్ట‌ర్ వారి అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా డిజైన్ అయింది. షారుఖ్ ఇచ్చిన ట్రీట్ సూప‌ర్‌డూప‌ర్ అంటున్నారు ఫ్యాన్స్. 
 
సౌత్ ఇండియాలో త‌లైవిగా, లేడీ సూప‌ర్‌స్టార్‌గా మెప్పించిన న‌య‌న‌తార‌కు బాలీవుడ్‌లో ఇది తొలి సినిమా. ప్ర‌ప్ర‌థ‌మంగా ఆమె ఉత్త‌రాదిన చేస్తున్న సినిమా కోసం అక్క‌డివారు కూడా ఎదురుచూస్తున్నారు. మొట్ట‌మొద‌టి సారి వెండితెర‌మీద క‌లిసి న‌టిస్తున్నారు షారుఖ్ ఖాన్‌, న‌య‌న‌తార‌. వారిద్ద‌రి మ‌ధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని చూడ‌టానికి వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు మూవీగోయ‌ర్స్. 
జ‌వాన్ ప్రివ్యూలో న‌య‌న‌తార‌ను చూసిన వారు వావ్ అంటున్నారు. హై ఆక్టేన్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ఆమె పాత్ర డిజైన్ అయిన తీరుకు ఫిదా అవుతున్నారు. పోస్ట‌ర్‌ని చూస్తుంటే నెక్స్ట్ లెవ‌ల్ మూవీ రెడీ అవుతోంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. న‌య‌న‌తార ఈ మూవీలో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తారు. ఆమె కేర‌క్ట‌ర్ సినిమాలో అత్య‌ద్భుతంగా హైలైట్ అవుతుంద‌నే విష‌యంలో అస‌లు అనుమానాలేం అక్క‌ర్లేదు. ఇలాంటి ఇంట్ర‌స్టింగ్ విష‌యాల‌ను వెల్ల‌డిస్తూ ఆడియ‌న్స్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నారు మేక‌ర్స్. నెక్స్ట్ అప్‌డేట్ ఏం ఇస్తారా? అంటూ ప్రేక్ష‌కులు వెయిట్ చేసేలా క్యూరియాసిటీ స్ట్రాంగ్‌గా క్రియేట్ అయింది.
 
రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రూపొందిస్తున్న సినిమా జ‌వాన్‌. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గౌరీఖాన్ నిర్మాత‌. గౌర‌వ్‌వ‌ర్మ స‌హ నిర్మాత‌. జ‌వాన్ మూవీని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. హిందీ, తెలుగు, త‌మిళ్‌లో విడుద‌ల కానుంది జ‌వాన్‌.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sandhya Theatre stampede: రేవంత్ రెడ్డి కామెంట్లతో ఏకీభవిస్తా, బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

చెక్క పెట్టెలో శవం.. వీడని మర్డర్ మిస్టరీ!

దోపిడీ పెళ్లి కుమార్తె : సెటిల్మెంట్ల రూపంలో రూ.1.25 కోట్లు వసూలు!

అల్లు అర్జున్ పైన ఆ కేసుతో 10 ఏళ్లు జైలు శిక్ష పడొచ్చు: సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ

మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు... కీలక శాఖలన్నీ సీఎం వద్దే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments