Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో జీవితాన్ని ప్రసాదించిన త్రివిక్రమ్ : నవీన్ చంద్ర

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (15:28 IST)
"అందాల రాక్షసి" చిత్రంలో విభిన్నమైన రోల్ చేసి నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న నవీన్ చంద్ర ఆ తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించాడు. అయితే హీరోగా నటించడం అతనికి కలిసి రాలేదు. ఎన్ని సినిమాలు తీసినా ప్రయోజనం లేకపోయింది. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడా ప్రయత్నాలు చేశాడు. అయినా కూడా అతని కెరీర్‌ పుంజుకోలేదు. 
 
ఆ సమయంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత' చిత్రంలో విలన్‌గా నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమాలో అతని పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ప్రశంసలు వెల్లువెత్తాయి. మళ్లీ అతనికి అవకాశాలు రావడం మొదలయ్యాయి. 
 
తాజాగా నవీన్ చంద్ర హీరోగా వేణు మధుకంటి దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో నవీన్ చంద్ర మాట్లాడుతూ వరుసగా ఫ్లాప్‌లు వచ్చిన సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ నాకు అరవింద సమేత చిత్రంలో బాలిరెడ్డి పాత్రను ఇచ్చారు. ఆ పాత్రతో మళ్లీ నాకు జీవం వచ్చినట్లయ్యింది. 
 
ఆ సినిమాతో నా కెరీర్ మళ్లీ ప్రారంభం అయినట్లయింది. ఎన్టీఆర్ ఆ సినిమాలో నాకు అవకాశం ఇవ్వకపోయి ఉంటే నా పరిస్థితి ఊహించుకోలేను అన్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో నిర్మితమౌతున్న ఈ చిత్రం కథపై నేను దర్శకుడు దాదాపు సంవత్సరం వర్క్ చేశాం. ఇద్దరం కలిసి చాలా రోజులు చర్చలు జరిపి మంచి కథను సిద్ధం చేశాం. ఇది ఒక మంచి చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం నాకుంది అని విశ్వాసం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

AI కోసం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

అనకనంద ఆస్పత్రిలో అనధికారికంగా కిడ్నీ మార్పిడి!!

సీఎం స్టాలిన్ హయాంలో అత్యాచారాలు పెరిగిపోయాయి : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments