Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌వ‌దీప్ 2.O ల‌వ్ మౌళి టీజ‌ర్ విడుద‌ల

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (17:09 IST)
navadeep, Pankhuri Gidwani
యాక్టర్ నవదీప్ కొంత విరామం తరువాత హీరోగా స‌రికొత్త‌గా న‌వ‌దీప్ గా  2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్,మౌళి. విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్  మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో క‌లిసి  నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన  సి స్పేస్  భాధ్యతలు తీసుకుంది.
 
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు విడుద‌లైన ద ఏంత‌మ్ ఆఫ్ ల‌వ్ మౌళి సాంగ్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.  ఈ చిత్రంలో చాలా డిఫ‌రెంట్‌గా  నవదీప్ కనిపించడంతో ఈ సినిమా న‌వ‌దీప్ 2.Oగా  అభిమానులంతా ఒక ఢిఫరెంట్ కాన్నెప్ట్ తొ వుంటుంద‌ని మంచి అంచ‌నాల‌తో ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. నేడు విడుద‌లైన ల‌వ్, మౌళి హీరో టీజ‌ర్ చూస్తుంటే.. వీరి అంచ‌నాల‌ను మ‌రింత పెంచే విధంగా వుంది. ఎందుకుంటే ఈ టీజ‌ర్‌లో న‌వ‌దీప్‌ను చూసిన వాళ్లంతా ఈసినిమాతో ఆయ‌న కొత్త ట్రెండ్ క్రియేట్ చెయ్య‌బోతున్నాడ‌ని అంటున్నారు. ల‌వ్, మౌళి హీరో టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క‌మం సోమ‌వారం హైద‌రాబాదులో జ‌రిగింది. 
 
ఈ సంద‌ర్భంగా హీరో న‌వ‌దీప్ మాట్లాడుతూ మ‌నం లైఫ్‌లో ఎన్నో చేయ‌ల‌నుకుంటాం. కానీ జ‌రిగేది వేరు. మ‌నం పెట్టే ప‌రుగులో ఆ విష‌యాన్ని గ‌మ‌నించం, అయితే ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర ఆగి, ఆలోచిస్తే మ‌న‌కు ఆ విష‌యం తెలుస్తుంది. అలా నేను కూడా వేరే వేరే సినిమాలు, అన‌వ‌స‌ర‌మైన సినిమాలు చేశాను. లాక్‌డౌన్ లో కొంత విరామం తీసుకుని నా వ‌ర్త్ ఏమిటో తెలుసుకున్నాను. ఆ కోవ‌లోనే విన్న క‌థ ఇది. నా ఆలోచ‌న విధానానికి, నేను చేయాల‌నుకుంటున్న సినిమాల‌కు ల‌వ్, మౌళి ద‌గ్గ‌ర‌గా అనిపించింది. అందుకే మీ ముందుకు స‌రికొత్త చిత్రంతో రాబోతున్నాను అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ, నా లైఫ్ లో జ‌రిగిన  ప్రేమ‌క‌థ‌ల‌కు ఫ‌లిత‌మే ఈ సినిమా క‌థ‌. నేను పాన్ ఇండియా లెవ‌ల్‌లో ప్రేమించేవాడ్ని. ప్రేమ అనే టాపిక్‌లో సో మెనీ వెరియేష‌న్స్ వున్నాయి. నా స్వీయ అనుభ‌వాలే  ఈ సినిమా క‌థ అన్నారు. క‌థానాయిక పంఖురి గిద్వానీ మాట్లాడుతూ చాలెంజింగ్‌గా భావించి చేసిన సినిమా ఇది, నా లైఫ్‌లో నేను చేయ‌లేను అనుకున్న  సాహ‌సాలు అన్నీ ఈ చిత్రం షూటింగ్ టైమ్ లో చేశాను. ప్రేమ గురించి ఎంతో నిజాయితీగా బ్యూటీఫుల్‌గా చెప్పిన ల‌వ్‌స్టోరీ ఇది. అంద‌రం ఓ ఫ్యామిలీలా క‌లిసి ఈ చిత్రానికి  ప‌నిచేశాం అని తెలిపారు. మ్యూజిక్ దర్శకుడు గోవింద్ వసంత అందించిన ఈ చిత్రంలోని పాట‌ల‌తో త‌ను ల‌వ్‌లో ప‌డ్డాన‌ని, ఈ చిత్రానికి నేప‌థ్య సంగీతం అందించ‌డం ఎంతో గొప్ప‌గా అనిపించంద‌ని క్రిష్ణ తెలిపారు.

పాట‌ల ర‌చ‌యిత అనంత్ శ్రీ‌రామ్ మాట్లాడుతూ న‌వ‌దీప్ న‌గ్న‌స‌త్యంతో మొద‌లై వ‌ర్ణ విస్పోట‌నంగా మారి సినిమా స‌రికొత్తగా వుంటుంది. ఈ చిత్రంలో న‌వ‌దీప్ త‌న‌కు తానే కొత్త‌గా ఆవిష్క‌రించుకుంటు న‌వ‌దీప్  2.0 గా క‌నిపించ‌బోతున్నాడు అన్నారు. ఈ స‌మావేశంలో న‌టి భావ‌న, క‌ళా ద‌ర్శ‌కుడు కిర‌ణ్ మామిడి  పాల్గొన్నారు.
 
ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు:
మెఘాలయలోని చిరపుంజీలో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని చిత్రీకరించారు. ఇలాటి వెట్ ప్లేస్ లో షూటింగ్ మొత్తం జరిగిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా ఈ చిత్రం నిలిచింది. ఒక వైవిధ్యమైన ప్రేమకథని తెరకెక్కించాలంటే ఆ ప్రేమ కథ జరిగే ప్లేస్ కూడా చాలా ముఖ్యం. దానికి దర్శకుడు  విజువల్‌గా ముందుగానే తను తీయబోయో చిత్రాన్ని చూడాలి. ఇండియాలోనే మొట్టమొదటి సారి అత్యంత గరిష్ట మైన తేమ వున్న ప్రదేశంలో ఈ చిత్ర కథని చూపించే ప్రయత్నం దర్శకుడు అవనీంద్ర చేయటం విశేషం గా చెప్పుకొవాలి. దర్శకుడు అవనీంద్ర ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తను అనకున్నది అనుకున్నట్టుగా చిత్రీకరించాడు అనటానికి ఈ టీజ‌ర్ లోని విజువ‌ల్స్ నిద‌ర్శ‌నం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

కలెక్టరేట్‌లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?

నలుగురు వికలాంగ కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. ఎక్కడ?

నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసిన వైకాపా నేత - హైడ్రా నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments