సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ నుంచి రెండో పాట రాధిక ఆకట్టుకుంటోంది

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (16:34 IST)
Sidhu Jonnalagadda, Anupama
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లు'తో మంచి గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ ఫుల్ స్టార్‌గా మారారు. ఈ చిత్రం ఆయనకు, ఆయన పోషించిన పాత్రకు ఎందరో అభిమానులను సంపాదించి పెట్టింది.
 
ఇప్పుడు 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్‌ గా రూపొందుతోన్న 'టిల్లు స్క్వేర్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు సిద్ధు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు.
 
ఇప్పటికే విడుదలైన మొదటి గీతం 'టికెట్టే కొనకుండా'లో అనుపమ గ్లామరస్ అవతార్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పుడు రెండవ గీతంలో కూడా ఆమె ఆకట్టుకుంటోంది. ఇక సిద్ధు జొన్నలగడ్డ పాటకి మరింత ఉత్సాహం తీసుకొచ్చారు.
 
'రాధిక' పాట ఆకర్షణీయమైన బీట్‌ను కలిగి ఉంది. రామ్ మిరియాల తన విలక్షణ శైలిలో పాటను స్వరపరచడమే కాకుండా తానే స్వయంగా ఆలపించారు. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. రామ్ మిరియాల సంగీతం, గాత్రం, కాసర్ల శ్యామ్ సాహిత్యం కలిసి ఈ పాట అద్భుతంగా ఉంది.
 
'డీజే టిల్లు'తో రాధిక పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. అంతగా జనాదరణ పొందిన 'రాధిక' పేరుతో వచ్చిన ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకసారి వినగానే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే అంతగా ఈ పాట బాగుంది. ఈ పాట ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని టాప్ 10 చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.
 
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది.
 
సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
 
టిల్లు స్క్వేర్ సినిమా 2024, ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments