Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది :అథర్వ డైరెక్టర్ మహేష్ రెడ్డి

director Mahesh Reddy
, సోమవారం, 27 నవంబరు 2023 (16:24 IST)
director Mahesh Reddy
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో క్లూస్ టీం ప్రాముఖ్యతను చూపించేలా తెరకెక్కించిన చిత్రం  'అథర్వ'. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా  హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో మూవీ డైరెక్టర్ మహేష్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..
 
 - అథర్వ’ కథ ఎలా పుట్టిందంటే - క్లూస్ టీం హెడ్ వెంకన్న గారి ఇంటర్వ్యూని చూశాను. మామూలుగా ఓ క్రైమ్ జరిగినప్పుడు క్లూస్ టీం చేసే పనే అధికంగా ఉంటుంది. వారు సేకరించేవే కోర్టులో సాక్ష్యాలుగా నిలబడతాయి. క్రైమ్‌ కేసుని 70 శాతం వరకు క్లూస్ టీం పరిష్కరిస్తుంటుంది. అలా క్లూస్ టీం గురించి ఇంత వరకు ఎవ్వరూ చెప్పలేదు.. వాళ్ల గురించి చెప్పాలని ఈ కథ రాసుకున్నాను.
 
- అథర్వ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో ఉంటుంది. మర్డర్, రాబరీ సీన్లతో సినిమాను అల్లుకున్నాను. చాలా వరకు రియలిస్టిక్‌గా ఉంటుంది. యదార్థ సంఘటనలను కూడా ఇందులో వాడకున్నాం. కాకపోతే సినిమా కోసం కాస్త ఫిక్షన్ కూడా యాడ్ చేశాను.
 
- అథర్వ చిత్రం సెకండ్ హాఫ్‌లో ప్రతీ పది నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ను ఎవ్వరూ ఊహించరు. ఆ సీన్లకు ప్రేక్షుడికి ఫుల్ హై వస్తుంది.
 
- ‘హవా’ని సినిమాగా ప్లాన్ చేయలేదు. నేను, చైతన్య రావు కలిసి ఏదో ఒకటి చేయాలని, ఇండస్ట్రీలోకి రావాలంటే ఓ కార్డ్‌లా ఉండాలని, ఓ ప్రయోగం చేశాం. అదే హవా. అది షార్ట్ ఫిల్మ్‌గా అనుకున్నాం. చివరకు అదే సినిమాలా మారింది. మంచి చిత్రాన్ని తీయాలనే ఇంత గ్యాప్ తీసుకున్నా.
 
- నిర్మాతలు ఈ కథను ముందుగా విన్నప్పుడు హీరో హీరోయిన్ల గురించి, టీం గురించి చెప్పలేదు. వారికి ఈ కథ నచ్చింది. ఎంతైనా పెట్టేందుకు ముందుకు వచ్చారు. సినిమా బాగా రావాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
 
- శ్రీచరణ్ పాకాల ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నారు. ఆర్ఆర్ ఆయన అద్భుతంగా ఇస్తారు. మా అథర్వ సినిమాకు మంచి ఆర్ఆర్ ఇచ్చారు. పోలీస్ సైరన్ నుంచి కూడా ఓ మ్యూజిక్ పుట్టించారు. ఆర్ఆర్‌తో పాటు మాకు మంచి మాస్, రొమాంటిక్, ఫోక్ సాంగ్స్‌ కూడా ఇచ్చారు.
 
 - అథర్వ’ చూస్తే, సీటు అంచున కూర్చోబెట్టేలా ఎంతో గ్రిప్పింగ్‌గా సినిమా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఇష్టపడే ప్రేక్షకులే కాకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన చిత్రమిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెవిల్ నుంచి రాజకుమారి పాడిన దిస్ ఈజ్ లేడీ రోజ్. సాంగ్