Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆలస్యం అయినా అను చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది : నటి ఆమని

Advertiesment
Amani, Karthik Raju,  Devi Prasad, Bhimineni Srinivasa Rao
, బుధవారం, 23 ఆగస్టు 2023 (16:03 IST)
Amani, Karthik Raju, Devi Prasad, Bhimineni Srinivasa Rao
కార్తిక్ రాజు, ప్రశాంత్ కార్తి, మిస్తి చక్రవర్తి, ఆమని, దేవి ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రల్లో అవి క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘అను’. తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద సందీప్ గోపిశెట్టి ఈ సినిమాకు దర్శక నిర్మాత బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి గుంపిన ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్. నేడు ఈ చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ ప్రెస్ మీట్‌లో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
 
 ఆమని మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. నేను ఇందులో చాలా మంచి పాత్రను, కొత్త కారెక్టర్‌ను పోషించాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత సందీప్‌కు థాంక్స్. ఎప్పుడూ టెన్షన్ పడలేదు. సినిమాను బాగా తీశారు. కరోనా వల్ల కాస్త సమస్యలు వచ్చినా, ఆలస్యం అయినా ఎప్పుడూ టెన్షన్ పడలేదు. మంచి సందేశాత్మక చిత్రమిది. సినిమాను అందరూ ఆదరించాలి. మీడియా, ఆడియెన్స్ సహకారం ఈ సినిమాకి ఉండాలి. ఈచిత్రం పెద్ద విజయం సాధించాల’ని కోరుకున్నారు.
 
 దర్శక నిర్మాత సందీప్ గోపిశెట్టి మాట్లాడుతూ.. ‘ఇది నా మొదటి చిత్రం. ఆమని, దేవి ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు లాంటి పెద్ద వాళ్లందరూ నటించారు. వాళ్లందరికీ థాంక్స్. ఈ రోజు హీరో హీరోయిన్లు వేరే షూటింగ్ ఉండటంతో రాలేదు. ఈ మూవీ అద్భుతంగా వచ్చింది. సెప్టెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామ’ని అన్నారు.
 
 ప్రశాంత్ కార్తి మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో నేను విలన్‌గా నటించాను. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకనిర్మాతకు థాంక్స్. నేను ఇందులో పోసాని గారి కొడుకుగా నటించాను. ఓ పిక్ నిక్‌కు వెళ్లినట్టుగా ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాల’ని కోరుకుంటున్నాను.
 
 దేవీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘దర్శకుడిలో ఎంతో ప్యాషన్ ఉంది. దర్శకుడిగా, నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హీరో హీరోయిన్లు చక్కగా నటించారు. భీమినేని శ్రీనివాసరావుగారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. చక్కని ప్లానింగ్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఆమని చాలా పెద్ద నటి మన అందరికీ తెలుసు. కానీ ఆమెకు తెలియదు. ఎంతో ఒద్దిగ్గా ఉంటారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమ’ని అన్నారు.
 
 భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘దేవి ప్రసాద్, నేను ఒకే టైంలో వేర్వేరు డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్లుగా పని చేశాం. కానీ దేవీ ప్రసాద్ ఆర్టిస్ట్‌గా పెద్ద సక్సెస్ సాధించాడు.  సందీప్ గోపిశెట్టి దర్శకుడిగా నిర్మాతగానూ వ్యవహరించడం చిన్న విషయం కాదు. ఆయన ఫ్యామిలీ అంతా కూడా డెడికేటెడ్‌గా ఈ సినిమాకు పని చేశారు. సినిమా టీం అంతా కూడా ఓ ఫ్యామిలీలా కలిసి పని చేశాం. దర్శకుడిలో ఎంతో ప్యాషన్ ఉంది. ఆమని గారితో ఇన్నేళ్ల తరువాత కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్’ అని అన్నారు.
 
 లైన్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. సంగీతం అద్భుతంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేశారు. నాకు సినిమా నచ్చి రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చాను. సెప్టెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామ’ని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా పెండ్లి ఎక్కడనేకంటే నా సినిమా గురించి తెలియజేయండి : వరుణ్‌తేజ్‌