Webdunia - Bharat's app for daily news and videos

Install App

`నార‌ప్ప‌` వాయిదా వేశారు

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (12:31 IST)
Narappa letter
వెంక‌టేష్ న‌టించిన `నార‌ప్ప‌` సినిమాను క‌రోనా వ‌ల్ల విడుద‌ల‌ను వాయిదా వేసిన‌ట్లు చిత్ర యూనిట్ గురువారంనాడు ప్ర‌క‌టించింది. ఇది కోలీవుడ్ చిత్రం “అసురణ్” కు రీమేక్ గా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించారు. అయితే అన్ని పనులు జరిగిపోయి సినిమా విడుదలను కూడా నిర్మాత‌లు వచ్చే మే లో విడుద‌ల చేస్తున్న‌ట్లు క‌రోనా సెకండ్‌వేవ్‌కు ముందు ప్ర‌క‌టించారు.
 
కానీ ప‌రిస్థితులు మారాయి, థియేట‌ర్లు పెద్ద‌గా లేవు. జ‌నాలు అంద‌రూ కోవిడ్‌కు భ‌య‌ప‌డి ఇళ్ళ వ‌ద్దే వుంటున్నారు. అందుకే ప్రేక్ష‌కుల ఆరోగ్యం కార‌ణంగా సినిమా వాయిదా వేస్తున్నామని మళ్ళీ పరిస్థితులు చక్కబడ్డాక త్వరలోనే విడుదల చేసేందుకే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
 
అంతే కాకుండా అందరూ ఇళ్లలోనే ఉండి కలసికట్టుగా కరోనా ను అరికట్టాలని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి దూరాన్ని పాటిస్తే అందరికీ సమాజానికి గొప్ప సాయం చేసిన వారు అవుతారని” నారప్ప యూనిట్ తెలియజేసారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందివ్వగా కళైపులి, డి.సురేష్ బాబు నిర్మించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

కెనడా రాజకీయాల్లో సంచలనం - ఉప ప్రధాని క్రిస్టియా రాజీనామా

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments