Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్‌లో హ‌రికృష్ణ క్యారెక్ట‌ర్ గురించి లేటెస్ట్ న్యూస్..!

ఎన్టీఆర్ బ‌యోపిక్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. బాల‌కృష్ణపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఎన్.బి.కె ఫిల్మ్స్ పైన నంద‌మూరి బాల‌కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ చైతన్య రథంపై తన చారిత్రాత్మక ఎన్

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:59 IST)
ఎన్టీఆర్ బ‌యోపిక్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. బాల‌కృష్ణపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఎన్.బి.కె ఫిల్మ్స్ పైన నంద‌మూరి బాల‌కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ చైతన్య రథంపై తన చారిత్రాత్మక ఎన్నికల ప్రచారాన్ని శ్రీకాకుళంలో ప్రారంభించారు. ఇప్పుడు ఆ స‌న్నివేశాల‌ను శ్రీకాకుళంలోనే షూట్ చేయనున్నారని స‌మాచారం. తన తండ్రి హరికృష్ణ పాత్రలో త‌న‌యుడు నందమూరి కళ్యాణ్ రామ్ న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే క‌ళ్యాణ్ రామ్ శ్రీకాకుళంలో జరిగే షూట్‌లో పాల్గొననున్నారు.
 
కళ్యాణ్ రామ్ ఈ చిత్రం కోసం 20 రోజుల పాటు డేట్స్‌ని కేటాయించారు. అయితే ఇటీవలే హరికృష్ణ హఠాన్మరణం తర్వాత, ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆయన పాత్రను ఇంకా పెంచాలని, సీనియర్ ఎన్టీఆర్ కోసం, పార్టీ కోసం, ఆయన చేసిన సేవలను ఈ చిత్రంలో చూపించాలని దర్శకనిర్మాతలు భావిస్తోన్నారని తెలిసింది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం.. పూజారి ఇంట సంచారం (video)

ఇద్దరు శ్రీవారి భక్తుల ప్రాణాలు తీసిన అంబులెన్స్!!

ఆ తల్లికి 'మదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' ఇవ్వాల్సిందే.. (Video)

Madhavi Latha: మగాడిలా పోరాడుతున్నా, కానీ కన్నీళ్లు ఆగడంలేదు: భోరుమన్న మాధవీ లత (Video)

భారత్‌లో HMPV వార్తలు, Sensex ఢమాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments