Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి భగవంత్ కేసరి షూటింగ్ పూర్తి

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (17:34 IST)
Nandamuri Balakrishna
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న  యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భగవంత్ కేసరి' దసరా కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇదీలావుండగా సినిమా షూటింగ్ పూర్తయింది. భగవంత కేసరి ప్రయాణం ఒక క్లిప్‌లో చూపించారు
 
పూజా కార్యక్రమం నుండి, నిర్మాణ పనులకు సంబంధించిన కీలకమైన వివరాలను వీడియోలో చూపించారు. ప్యాషినేట్ టీమ్ 8 నెలల పాటు తీవ్రంగా శ్రమించారు . 24 అద్భుతమైన ప్రదేశాలలో, 12 మాసివ్ సెట్లలో షూటింగ్ జరిగింది. బాలకృష్ణ కొన్ని పవర్ ప్యాక్డ్ డైలాగ్‌లు చెబుతున్నట్లు కూడా వీడియోలో ఉంది. “కలిసి మాట్లాడతా అన్నా కదా, అంతలోనే మందిని పంపాలా... గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే...” అంటూ గూండాలను హెచ్చరించారు. బాలకృష్ణ చెప్పిన చివరి డైలాగ్ “బ్రో... ఐ డోంట్ కేర్”  మొండి స్వభావాన్ని తెలియజేస్తుంది.
 
అనిల్ రావిపూడి, బాలకృష్ణను మునుపెన్నడూ లేని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. గెటప్ కూడా పూర్తిగా కొత్తగా వుంది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలకృష్ణ కనిపిస్తారు. ఎస్ఎస్ థమన్ అద్భుతమైన స్కోర్ విజువల్స్ కు బలం చేకూర్చింది.
 
ఇటీవలే గణేష్ చతుర్థి వేడుకల్లో సంచలనంగా మారిన గణేష్ సాంగ్ తో ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ పాటలో బాలకృష్ణ, శ్రీలీల కలిసి డ్యాన్స్ చేయడం కన్నుల పండువగా ఉంది.
 
సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఇందులో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.  జాతీయ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సి రామ్ ప్రసాద్, ఎడిటర్ తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 
భగవంత్ కేసరి అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.
 
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments