Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే జగన్ ఇలాంటి చర్యలు : బాలకృష్ణ మండిపాటు

Advertiesment
balakrishna latest
, మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (12:32 IST)
balakrishna latest
ఇటీవలే చంద్ర బాబు అరెస్ట్ తెలిసిందే. దీనిపై నేడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొద్దిసేపటికి క్రితం  మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నేను ఎం.ఎల్.ఏ. గా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పనులు చేశాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. కానీ ఏమి చేయని జగన్ పాలన సాగిస్తున్నాడు. 
 
అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్నారు . ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారు.
 సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధింపులే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారు .
 
పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారు  హిందూపురంలో 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వేలమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా?  అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా? అవినీతి జరిగితే ఛార్జిషీట్ ఎందుకు వేయలేదు?  రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు 
 
అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్ .కక్ష సాధింపులే జగన్ లక్ష్యం. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలు . జగన్ 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు . చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్ కుట్ర.స్కిల్ డెవలప్‌మెంట్ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారు .సీఎం కేవలం పాలసీ మేకర్.. అధికారులే అమలు చేస్తారు. అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్ చంద్రారెడ్డి అమలు చేశారు.
 
 ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసింది .2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు డిజైన్ టెక్ సంస్థకు జగన్ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చింది .జగన్.. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు . ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు . ఉన్న సంస్థలు విధ్వంసం చేసి.. యువతను గంజాయికి బానిస చేశారు .
 
జగన్ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారు . ఇప్పుడు గాలికబుర్లు చెబుతున్నారు.. పీల్చే గాలిపై కూడా పన్నులు వేస్తారు .జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడింది .
 
పోలవరం ప్రాజెక్ట్ పడకేసింది.రాజధాని ఏదో తెలియని పరిస్థితి  జగన్ పై పీడీయాక్ట్, ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయి .10 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు.ప్రజలు అనుభవించింది చాలు.. మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలి .మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించను . రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయమిది.
 
 నేను మీ ముందుంటా.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.తెలుగువాడి పౌరుషం ఏంటో చూపిద్దాం  అని  టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యంత విషమంగా ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్యం... ఐసీయూలో అడ్మిట్