Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నందమూరి బాలకృష్ణ 50 గ్లోరియస్ ఇయర్స్ - భైరవద్వీపం 4కె రాబోతుంది

Advertiesment
Bhairavadweep 4K
, సోమవారం, 28 ఆగస్టు 2023 (12:23 IST)
Bhairavadweep 4K
1974లో అద్భుతమైన అరంగేట్రం చేసిన నటసింహ నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో 50 గ్లోరియస్ ఇయర్స్ పూర్తి చేసుకున్నారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నటసింహ బాలకృష్ణ ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ “భైరవద్వీపం” ఈ తరం ప్రేక్షకులను అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. 1994లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ ఎవర్‌గ్రీన్ ఫాంటసీ ఎంటర్‌టైనర్.,  క్లాప్ ఇన్ఫోటైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా రీ-రిలీజ్ అవుతోంది.  ప్రేక్షకులకు మెమరబుల్ సినిమాటిక్ అనుభూతిని అందించి, బాక్సాఫీస్ వద్ద అద్భుతాలను సృష్టించిన ఈ చిత్రం.. అప్‌గ్రేడ్ చేసిన 4కె క్వాలిటీతో ఆగస్ట్ 30, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ (కెఎస్ రవీంద్ర),  గోపీచంద్ మలినేని ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆదిత్య మ్యూజిక్‌లో రీ-రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ తరం ప్రేక్షకులకు థియేటర్లలో అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని పంచబోతుందని ట్రైలర్ భరోసా ఇచ్చింది.
 
క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్‌ పివి గిరి రాజు, పి దేవ్ వర్మ ‘భైరవ ద్వీపం’ రీ రిలీజ్ తో ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించనున్నారు. బాలకృష్ణ ఒక తెగలో పెరుగుతున్న రాకుమారుడు విజయ్‌ గా ధైర్య సాహసాలు కలిగిన వీరుడిగా కనిపిస్తారు. విజయ్, కార్తికేయ రాజ్యానికి చెందిన యువరాణి ప్రేమలో పడతారు. ఒక దుష్ట మాంత్రికుడు, యువరాణిని బలి ఇవ్వడానికి 'భైరవ ద్వీపం' అనే ద్వీపానికి మాయాజాలం ద్వారా తీసుకువెళ్తాడు. విజయ్ చెడుతో పోరాడి, యువరాణిని ఎలా కాపాడతాడు అనేది.. గొప్ప మలుపులతో, అద్భుతమైన దృశ్యాలతో కూడిన విజువల్ వండర్  'భైరవ ద్వీపం'.
 
రావి కొండల రావు రాసిన మ్యాజికల్ స్టోరీకి దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్వయంగా అద్భుతమైన స్క్రీన్‌ ప్లే ని అందించారు. మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్ . ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ కబీర్ లాల్, ఎడిటింగ్ డి.రాజ గోపాల్. చందమామ విజయ కంబైన్స్ బ్యానర్‌పై నిర్మాత బి. వెంకటరామి రెడ్డి నిర్మాణ విలువలు ప్రతి జనరేషన్ ని ఆకట్టుకునేలా అత్యున్నత స్థాయిలో వుంటాయి.  
 
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, రోజా, కైకాల సత్యనారాయణ, విజయకుమార్, రంభ, విజయ రంగరాజు, శుభలేఖ సుధాకర్, గిరి బాబు, బాబు మోహన్, మిక్కిలినేని, పద్మనాభం, సుత్తివేలు, కోవై సరళ, చిట్టి బాబు, కెఆర్ విజయ, మనోరమ, సంగీత, రజిత, కోవై సరళ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు కథ: రావి కొండలరావు నిర్మాత: బి వెంకటరామి రెడ్డి
సంగీతం: మాధవపెద్ది సురేష్సి నిమాటోగ్రఫీ: కబీర్ లాల్ఎ డిటింగ్: డి రాజ గోపాల్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చూడాలని ఉంది సినిమాతో ఒక్కసారిగా నా జీవితాన్ని మార్చేశారు : హీరో తేజ సజ్జ