Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి నుంచి గణేష్ సాంగ్ రాబోతుంది

Advertiesment
Balakrishna-ganesh song
, గురువారం, 24 ఆగస్టు 2023 (16:39 IST)
Balakrishna-ganesh song
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ డెడ్లీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'భగవంత్ కేసరి' మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ గణేష్ సాంగ్ సెప్టెంబర్ 1న విడుదల కానుంది.
 
బాలకృష్ణ గత చిత్రం 'అఖండ'కు ఎక్స్ టార్డినరి మ్యూజిక్ అందించిన ఎస్ఎస్ థమన్ భగవంత్ కేసరి కోసం సెన్సేషనల్ ఆల్బమ్‌ను అందించారు. టైటిల్, పోస్టర్ సూచించినట్లుగా ఇది మాస్ నంబర్ అవుతుంది. పోస్టర్‌లో మునుపెన్నడూ లేని మాస్ అవతార్‌లో డ్రమ్స్ కొడుతూ కనిపించారు బాలకృష్ణ. పాటలోని ఎనర్జీ ఆయన ముఖంలోనే కనిపిస్తుంది. పోస్టర్‌లో డ్యాన్సర్‌లను కూడా మనం చూడవచ్చు.
 
సినిమా ఫస్ట్‌ గ్లిమ్ప్స్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్‌ వచ్చింది. బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ అలరించారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
 
ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 
దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది 
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సలోని తంత్ర లో కీలక పాత్రతో కమ్‌బ్యాక్‌ అవుతుంది