Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సలోని తంత్ర లో కీలక పాత్రతో కమ్‌బ్యాక్‌ అవుతుంది

Advertiesment
Saloni-tantra
, గురువారం, 24 ఆగస్టు 2023 (16:07 IST)
Saloni-tantra
‘ధన 51’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సలోని. ‘మర్యాద రామన్న’, ‘బాడీగార్డ్‌’ చిత్రం చక్కని గుర్తింపు పొందింది. పక్కింటి అమ్మాయి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తదుపరి పలు చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నటించారు. ‘రేసుగుర్రం’ చిత్రంలో అతిథి పాత్రలో మెప్పించిన ఆమె తెలుగు సినిమాలకు కొంతగ్యాప్‌ ఇచ్చింది. ప్రస్తుతం ‘తంత్ర’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్‌’ చిత్రాల ఫేం అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్ర పోషించనున్నారు. 
 
ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వైజాగ్  ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్‌ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. ‘మగధీర’లో షేర్‌ఖాన్‌ లాంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన  దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. 
 
ఈ మేరకు దర్శనిర్మాతలు మాట్లాడుతూ  ‘‘ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ లైన్‌తో రూపొందుతున్న హారర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాఽథల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా స?గుతుంది. తంత్ర శాస్ర్తానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలను ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నాం. ఇందులో అనన్య నాగళ్లతోపాటు ‘మర్యాదరామన్న’ ఫేం సలోని కీ రోల్‌ పోషిస్తున్నారు. గాళ్‌ నెక్ట్స్‌ డోర్‌ రోల్‌తోపాటు గ్లామర్‌ పాత్రలతోనూ మెప్పించిన సలోని ఇందులో డిఫరెంట్‌గా కనిపిస్తారు. నటనకు ఆస్కారమున్న పాత్ర అది. ఇటీవల అనన్యా, సలోని, హీరోపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అవుట్‌పుట్‌బాగా వచ్చింది. ఈ చిత్రం టీమ్‌ అందరికీ మంచి పేరు తీసుకురావడంతోపాటు సలోనికి మంచి కమ్‌బ్యాక్‌ అవుతుంది’’ అని తెలిపారు.
నటీనటులు 
అనన్య నాగళ్ల. ధనుష్‌, సలోని, టెంపర్‌ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను చంపేస్తారని సమాచారం వుంది, నన్ను కాపాడండి: డిజిపికి పోసాని ఫిర్యాదు