Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చూడాలని ఉంది సినిమాతో ఒక్కసారిగా నా జీవితాన్ని మార్చేశారు : హీరో తేజ సజ్జ

Advertiesment
chiru-tej sajja
, సోమవారం, 28 ఆగస్టు 2023 (12:15 IST)
chiru-tej sajja
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా గుణశేఖర్‌  దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘చూడాలని ఉంది’. నిర్మాతా అశ్వనీదత్‌ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద  రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంతోనే బాలనటుడిగా అరంగేట్రం చేశారు హీరో తేజ సజ్జ. ఈ సినిమా విడుదలై నేటితో  25 ఏళ్లు పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు గుణశేఖర్, నిర్మాత అశ్వినీ దత్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఓ నోట్ రాశారు తేజసజ్జ.
 
‘’25 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు.  ఏమి జరుగుతుందనే అవగాహన లేకుండా పరిశ్రమలో అడుగు పెట్టాను. నా జీవితం మారిపోయింది. ఎంతో దయకలిగిన లెజెండ్‌తో తెరపై నా మొదటి పెర్ఫార్మెన్స్ మొదలైయింది. ఇప్పుడు హనుమాన్ కోసం ఎదురు చూస్తున్నాను.  ఇదంతా కలలా అనిపిస్తుంది. ఈ కల మీ అందరివలనే  జీవం పోసుకుంది.     మీరంతా  నా కుటుంబం.  ఈ రోజు నేను ఈ స్థానంలో ఉండటానికి కారణం మీ ప్రేమ, ఆదరణ. గుణశేఖర్ గారు, చిరంజీవి గారు, అశ్వినీదత్ గారు మీరంతా ఒక్కసారిగా నా జీవితాన్ని మార్చేశారు ఎప్పటికీ మీకు కృతజ్ఞతతో వుంటాను. అంటూ తేజసజ్జ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ తెలుగు-7: కిరణ్ రాథోడ్, షకీలాలు ఎంట్రీ ఇస్తారా?